భర్తపై వేడిపాలు పోసిన భార్య: కేసు నమోదు, డబ్బులు తీసిందని కూతురికి వాతలు

హైదరాబాద్: భర్తతో గొడవపడిన ఓ మహిళ ఆగ్రహంతో మరుగుతున్న పాలు పాలను అతనిపై పోసిన ఘటన నగరంలోని హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎల్లారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న మదన రాంచందర్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.

అతడికి ప్రియాంకతో రెండున్నరేళ్ల క్రితం వివాహం జరిగింది. నవంబర్ 30న ఉదయం భోజనం పెట్టమని ప్రియాంకను రాంచందర్ కోరాడు. ఆమె దురుసుగా సమాధానం ఇవ్వడంతో ఎందుకలా మాట్లాడతావంటూ అడిగాడు. దీనికే ఆగ్రహానికి గురైన ప్రియాంక స్టౌపై ఉన్న మరుగుతున్న పాలను భర్తపై పోసింది. దీంతో గాయాలపాలైన అతడు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

A woman allegedly poured hot milk on her husband

డబ్బులు తీసిందని కూతురుకు వాతలు

ఇంట్లో డబ్బులు తీసి ఖర్చు పెట్టిందన్న ఆరోపణతో ఓ మహిళ కుమార్తెకు వేడిగా ఉన్న గరిటెతో వాతలు పెట్టింది. ఈ ఘటన నగరంలోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధ తాళలేక బాలిక కేకలు వేయడంతో స్థానికులు విని జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారమందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని బాలికను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల్‌కు చెందిన ఆంజనేయులు, వాణి దంపతులు రహమత్‌నగర్‌లో వివరాల్లోకి వెళితే.. నివాసముంటున్నారు. ఆంజనేయులు కూలి పని చేస్తుండగా, వాణి డైమండ్‌హౌస్‌లో హౌస్‌ కీపింగ్‌ సెక్షన్‌లో కార్మికురాలిగా పనిచేస్తుంది. వీరి కుమార్తె సోని (5) స్థానికంగా ఉన్న అంగన్‌వాడీ పాఠశాలలో చదువుకుంటోంది.

కాగా, మంగళవారం ఉదయం పనికి వెళ్లిన వాణి సాయంత్రం రాగా ఇంట్లో దాచిన వంద రూపాయలు కనిపించకపోవడంతో కూతుర్ని అడిగింది. తాను డబ్బు తీయలేదని చెప్పిన వినకుండా.. సోనియే డబ్బు తీసి ఖర్చు చేసిందని అనుమానించి తీవ్రంగా కొట్టింది.

పొయ్యి మీద గరిటె కాల్చి సోని ముఖంపై, చేతులు, కాళ్లపై వాతలుపెట్టింది. బాధ తాళలేక సోని కేకలు వేయడంతో స్థానికులు విని జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారమందించారు. స్కూల్‌కు వెళ్లడం లేదన్న కోపంతో కుమార్తెకు వాతలు పెట్టినట్టు వాణి చెప్పింది.

నగల షాపు దోపిడీ కేసులో వీడిన మిస్టరీ

చార్మినార్‌ నగల షాపు దోపిడీ కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి తుపాకీ, నాలుగు బుల్లెట్లు, రూ.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అంతర్రాష్ట దోపిడీ దొంగల ముఠాగా పోలీసులు గుర్తించారు. ఈ రోజు మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+