అతిథిగా వచ్చి రేప్ చేశాడు: మాయమాటలు చెప్పి..
హైదరాబాద్: మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఓ వైద్యుడ్ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన సోయల్ కుమార్ ఆర్థోపెడిక్ వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. గత సంవత్సరం హైదరాబాద్‌లోని ఎల్బినగర్‌లోని ఓ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ ఉండటంతో ఇక్కడికి వచ్చాడు.
ఆనందనగర్ కాలనీలో నివాసముండే బంధువైన మహిళ ఇంట్లో బస చేశాడు. ఆమె వంటగదిలో ఉండగా నోరుమూసి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బటికి చెబితే అంతుచూస్తానని బెదిరించడంతో పాటు ఫొటోలను నెట్లో పెడతానని హెచ్చరించాడు.

దీంతో ఆమె ఎవరికీ చెప్పలేదు. అతని వేధింపులు ఎక్కువ కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న సోయల్‌ను తిరుపతిలో మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
మరో ఘటనలో మాయమాటలు చెప్పి నమ్మించిన ఓ వ్యక్తి 17ఏడేళ్ల యువతిని తన వెంట తీసుకెళ్లాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లాకు చెందిన అనిల్(25) బోరబండలోని స్నేహపురి కాలనీలో ఉంటూ కూలీ పనులు చేస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉంటున్న యువతికి మాయమాటలు చెప్పి జూన్ 23న తన వెంట తీసుకెళ్లాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడు అనిల్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications