దారుణం: ఒంటరిగా వెళుతున్న మహిళపై గ్యాంగ్‌రేప్

A woman allegedly raped by three men
అనంతపురం: జిల్లాలోని చిలమత్తూరు మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన 56 ఏళ్లు పైబడిన ఓ మహిళ తనపై ముగ్గురు వ్యక్తులు బుధవారం రాత్రి అత్యాచారం చేసినట్లు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాధిత మహిళ బుధవారం హిందూపురం వచ్చి రాత్రి 7 గంటల సమయంలో బస్సులో దేమకేతేపల్లికి వెళ్లింది.

అక్కడి నుంచి రాత్రి 9 గంటల సమయంలో కాలినడకన కొర్లకుంటకు చేరుకుంది. అయితే తీవ్రంగా బాధ పడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు విచారించగా అత్యాచారానికి గురైనట్లు పేర్కొంది. దీంతో వెంటనే ఆమెను 108 వాహనంలో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

విషయం తెలిసిన వెంటనే పోలీసులు భిన్నకోణాల్లో విచారణ చేపట్టారు. అలాగే డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆమె చెప్పిన ప్రాంతాల్లో విచారణ నిర్వహించారు. ఇదిలా ఉండగా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ సాగిస్తున్నట్లు తెలిసింది.

ఎస్‌బీఐ ఏడీబీ నగదు స్వాహా కేసు: నిందితుల అరెస్టు

కదిరి పట్టణంలోని ఎస్‌బీఐ ఏడీబీలో రూ. ఒక కోటి లక్షా 59 వేలకు పైగా స్వాహాకు పాల్పడిన ఎంఎస్‌ జుహా, ఎం. ప్రసాద్‌, ఇంతియాజ్‌లను అరెస్టు చేసినట్లు పుట్టపర్తి డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. గురువారం కదిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్టు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఎస్‌బీఐ ఏడీబీలో నగదు స్వాహా అయినట్లు స్టేట్‌బ్యాంక్‌ రీజనల్‌ మేనేజర్‌ ఎ. శ్రీనివాసరెడ్డి ఈ ఏడాది మే 20వ తేదీన పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

2011, 2012వ సంవత్సరానికి చెందిన పాత ఇన్సూరెన్స్‌ డబ్బులను సుమారు రూ. ఒక కోటి లక్షా 59 వేలు అసిస్టెంట్‌ బ్రాంచి మేనేజర్‌ ఎంఎస్‌ జుహా, ఫీల్డ్‌ ఆఫీసర్‌ వై. అశోక్‌కుమార్‌రెడ్డి, మరో ఇద్దరు ఎం. ప్రసాద్‌, ఇంతియాజ్‌ కాజేశారు. ఈ నగదు స్వాహాకు గురైనప్పుడు జుహా బ్రాంచి మేనేజర్‌గా విధులు నిర్వర్తించారు. వీరు గతంలోనే రూ.30లక్షలు బ్యాంక్‌లో జమ చేయగా, ప్రస్తుతం రూ.2.89 లక్షలు స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన మొత్తాన్ని రికవరీ చేయాల్సి ఉందని డీఎస్పీ వెల్లడించారు.

మొత్తం 41 ఖాతా నెంబర్ల నుంచి నగదు వేర్వేరుగా ఆర్థిక లావాదేవీలు చేసినట్లు చెప్పారు. అసిస్టెంట్‌ బ్రాంచి మేనేజర్‌గా విధులు నిర్వర్తించిన జుహా ఈ కేసులో మొదటి ముద్దాయి అని చెప్పారు. ఇందులో కీలకంగా ఉన్న మరో నిందితుడు అశోక్‌కుమార్‌రెడ్డి కోసం గాలిస్తున్నామన్నారు. ఈ కేసులో ఇంకా సంబంధమున్న అనుమానితులను విచారిస్తున్నామని, విచారణ పూర్తి కాలేదన్నారు. వీరిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+