హిమబిందును రేప్ చేసి హత్య చేశారు: ఇద్దరు అరెస్ట్

మార్చి 17వ తేదీ రాత్రి ఆమె మృతదేహం కంకిపాడు వద్ద బందరు కాలువలో లభ్యమైంది. మిస్టరీగా మారిన ఈ హత్య కేసు వివరాలను విజయవాడ డిసిపి ఎం రవిప్రకాష్ సోమవారం మీడియాకు తెలిపారు. నిందితులు మహ్మద్ సుభానీ(27), గోపీకృష్ణ(25)లను మీడియా ముందు ప్రవేశపెట్టారు. బ్యాంకు మేనేజర్ సాయిరాం నివాసం ఉండే అపార్టుమెంటు యజమానికి సుభానీ కారు డ్రైవరుగా పని చేస్తున్నాడు. గోపీకృష్ణ గతంలో డ్రైవర్‌గా పని చేశాడు.
హిమబిందు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, నల్లా మరమ్మతు చేస్తామంటూ వారిద్దరూ లోనికి చొరబడ్డారు. ఆ తర్వాత ఆమెపై దాడి చేసి, అత్యాచారానికి పాల్పడ్డారు. వారితోపాటు వచ్చిన మరో నలుగురు కూడా ఆమెపై ఘాతుకానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెను గొంతు నులిమి చంపేశారు. శవాన్ని ఖాళీగా ఉన్న పక్క ఫ్లాటులోకి తీసుకెళ్లి దాచేశారు. కాగా, సాయిరాం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా భార్య కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, నిందితులు బాధిరాలి ఫోన్ ద్వారా సాయిరాంకు, పోలీసులకు ఫోన్ చేసి ఆమెను తమతోపాటు తీసుకెళ్తున్నామని చెప్పారు. దీంతో పోలీసులు ఆ సెల్‌ఫోన్‌పై నిఘా పెట్టారు. మార్చి 17వ తేదీ తెల్లవారుజామున దుండుగులు ఆమె మృతదేహాన్ని బందరు కాలువలో పడేశారు. సుభానీపై అనుమానం వచ్చిన పోలీసులు, తమదైన శైలిలో విచారించారు. దీంతో అతడు నేరాన్ని అంగీకరించాడు.
సుభానీతోపాటు మరో నిందితుడైన గోపీకృష్ణను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, హిమబిందు హత్య కేసు విషయంలో చొరవతీసుకోవాలని గర్నర్ నర్సింహన్‌కు కూడా బాధితురాలి కుటుంబ సభ్యులు కలిశారు. దీంతో ఆయన కేసు విషయంలో వెంటనే విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications