Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నిత్య పెళ్ళికొడుకుపై భార్య ఫిర్యాదు, షాక్ తిన్న నలుగురు భార్యలు

ఒకరికి తెలియకుండా మరోకరిని బురిడీ కొట్టించి ఏకంగా నలుగురిని వివాహం చేసుకొన్నాడు ఓ ప్రబుద్దుడు.అయితే నాలుగో భార్యతో గొడవతో ఈ విషయం వెలుగుచూసింది. ఈ నిత్య పెళ్ళికొడుకుపై బాధితురాలు పోలీసులకు పిర్యాదు చే

విశాఖపట్టణం: ఒకరికి తెలియకుండా మరోకరిని బురిడీ కొట్టించి ఏకంగా నలుగురిని వివాహం చేసుకొన్నాడు ఓ ప్రబుద్దుడు.అయితే నాలుగో భార్యతో గొడవతో ఈ విషయం వెలుగుచూసింది. ఈ నిత్య పెళ్ళికొడుకుపై బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది.ఈ ఘటన విశాఖ జిల్లాలో వెలుగుచూసింది.

విశాఖపట్టణంలోని నరసింహనగర్ కు చెందిన జె. అరుణ్ కుమార్ న్యూ గరుడా ట్రావెల్స్ ను నిర్వహిస్తున్నాడు.ఆయన తన భార్య చనిపోయిందని చెప్పి శివాజీపాలెనికి చెందిన శ్యామలను 2015 లో వివాహం చేసుకొన్నాడు. వీరిద్దరికి ఓ పాప కూడ ఉంది.

వాహనం కొనుగోలు కోసం డబ్బులు కావాలని చెప్పి శ్యామల వద్ద రూ. 4 లక్షలను తీసుకొన్నాడు. ఆ తర్వాత తరచూ గొడవపడుతూ ఆమెను దూరం చేయడం మొదలుపెట్టాడు.

A woman lodges complaint against four-time married husband

దీంతో అనుమానం వచ్చిన శ్యామల అరుణ్ కుమార్ గురించి ఆరా తీసింది. తనకంటే ముందే మరో ముగ్గురు మహిళలను పెళ్ళిచేసుకొన్నట్టు శ్యామల గుర్తించింది.ఈ విషయం తెలిసి ఆమె షాక్ కు గురైంది.

మొదటి భ్యారకు సంతానం కూడ ఉంది. రెండో భార్య చనిపోయింది. మూడో భార్యకు పాప ఉంది. తనను నాలుగో పెళ్ళి చేసుకొని నట్టేట ముంచాడని శ్యామల భోరున విలపించింది. పోలీసులను ఆశ్రయించింది.

మహిళల జీవితాలతో ఆటలు ఆడుకొంటున్న అరుణ్ కుమార్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆమె కోరుతోంది. ఈ మకేసు మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తోందని అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు మహిళా పోలీసులకు శ్యామ ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+