పెళ్లి రోజే మహిళ ఆత్మహత్య: భర్తపై అనుమానం

సోమవారం వారి పెళ్లి రోజు. ఆ రోజైనా తన భర్త తాగకుండా వస్తాడని రాధ రాత్రి వరకు గుమ్మం వద్దే వేచి చూసింది. రాత్రి 11 గంటలకు మద్యం మత్తులో తూలుతూ ఇంటికి వచ్చాడు నరేందర్ రెడ్డి. దీంతో పెళ్లి రోజైనా తాగకుండా ఉండలేవా అని ఆమె తన భర్తతో గొడవ పడింది. మద్యం మత్తులో ఉన్న నరేందర్ రెడ్డి ఆమెను కొట్టడంతో మనస్తాపానికి గురైన రాధ ఆత్మహత్యకు పాల్పడింది.
ఇది గమనించిన నరేందర్ రెడ్డి.. రాధ మృతదేహాన్ని కిందకు దింపి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన గుర్తించిన బంధువులు, స్థానికులు నరేందర్ రెడ్డికి దేహశుద్ధి చేయడంతో అసలు విషయం చెప్పాడు.
అయితే రాధను భర్తే హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతురాలి భర్త నరేందర్ రెడ్డితోపాటు అత్తామామలు విమలమ్మ(45), నాగిరెడ్డి(50)లను అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications