సంజామల విషాదంలో విచిత్రం: మార్చురీలో లేచి కూర్చున్న మహిళ

Subscribe to Oneindia Telugu

కర్నూలు: జిల్లా సంజామల మండలంలోని మిక్కినేనిపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి నలుగురు మృతి చెందినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ఆస్పత్రికి ఆ నలుగురి మృతదేహాలను తరలించారు.

అయితే, ఆస్పత్రి మార్చురీలో నలుగురి మృతదేహాలు ఉంచగా.. మద్దమ్మ(70) అనే మహిళ లేచి కూర్చుంది. అప్పటి వరకు చనిపోయిందనుకున్న మహిళ లేచి కూర్చుండటంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

A woman wake up and seated in Mortuary

కాగా, విద్యుత్ షాక్ కారణంగా కోమాలోకి వెళ్లి.. ఇప్పుడే స్పృహలోకి వచ్చి ఉంటుందని వైద్యులు తెలిపారు. మద్దమ్మ తిరిగి లేవడంతో ఆమె కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయాలపాలైన మద్దమ్మ మనవరాలు రజితను కోవెలకుంట్ల ఆసుపత్రికి తరలించారు.

ఈ విద్యుత్ షాక్ ఘటనలో సుకూర్‌ భాషా(35), ఉప్పరి సుధాకర్‌(20), ప్రవల్లిక(11) ప్రాణాలు కోల్పోయారు. మిక్కినేనిపల్లి గ్రామానికి చెందిన ఈ ఐదుగురు రైతులు తమ పంట పొలానికి వెళుతుండగా విద్యుదాఘాతానికి గురయ్యారు. అడవి పందులు రాకుండా పొలాల చుట్టూ ఏర్పాటు చేసిన కంచెకు విద్యుత్తు సరఫరా కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman wake up and seated in Mortuary in Nandyal hospital in Kurnool district on Friday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి