Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం సొంత జిల్లాలో వైసీపీ కౌన్సిలర్ చేతివాటం, ఉద్యోగాల పేరుతో చీటింగ్, వామ్మో

వైసీపీ నాయకులకు ఓ పదవి ఉంటే ఏమైనా చేస్తారని మరోసారి వెలుగు చూసింది. నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తామని వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని ఐడి కార్డులు ఇచ్చేసి వారితో వెట్టి చాకిరి చేయించుకుని కనీసం ఒక్క నెల కూడా జీతం ఇవ్వలేదు అనే విషయం సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో వెలుగులోకి రావడం కలకలం రేపింది.

మోసం పోయామని గుర్తించిన ఆ యువకులు ఇప్పుడు టీడీపీ నాయకులను ఆశ్రయించారు. ఆ యువకులు ఎవరికీ డబ్బులు ఇచ్చారో వారితోనే మాట్లాడుకోవాలని, తనకు ఏమాత్రం సంబంధం లేదని మున్సిపల్ కమిషనర్ తేల్చిచెప్పడం హాట్ టాపిక్ అయింది. రెండు సంవత్సరాలకు పైగా మునిసిపాలిటీలో పని చేసినా జీతాలు రాకపోవడం, ఉద్యోగం కోసం ఇచ్చిన లంచాలను ఆ వైసీపీ నాయకుడు మాకు తిరిగి ఇవ్వడంలేదని ఆ యువకులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఫిర్యాదులు చేశారు.

A YCP councilor who cheated by taking money saying that he would be given jobs in the municipality

వైసీపీ ప్రభుత్వంలో కౌన్సిలర్ గా గెలిచిన మునిసిపల్ కౌన్సిలర్ ఇప్పుడు తనకు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం వివాదానికి కారణమైంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆ పార్టీకి చెందిన నాయకుడు చక్రం తిప్పిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలమనేరులో వైసీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని సమీర్, ముబారక్, అన్వర్ భాష అని ముగ్గురి దగ్గర సుమారు నాలుగు లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

ఆ తర్వాత అప్కాన్ విధానంతో పలమనేరు మునిసిపల్ పరిధిలోని గుర్రంపల్లి కురప్పల్లె కాలనీ, గడ్డూరు కాలనీ ప్రాంతాల్లో నీటి పంపు ఆపరేటర్లుగా ఈ ముగ్గురికి ఉద్యోగాలు ఇస్తున్నామని ఆ వైసీపీ కౌన్సిలర్ ఈ ముగ్గురికి 2022 జులై నెలలో ఐడి కార్డులు ఇచ్చారు. మున్సిపల్ వైసీపీ కౌన్సిలర్ ఇచ్చిన ఐడి కార్డులు ఒరిజినల్ అని అప్పటి పలమనేరు మున్సిపల్ కమిషనర్ కూడా ధ్రువీకరించారు. ముగ్గురూ అక్కడ విధులు నిర్వహించారు. 2022 జూలై నుండి 2024 జూలై వరకు ఈ ముగ్గురు నీటి పంపు సెట్ ఆపరేటర్లుగా ఉద్యోగాలు చేశారు.

అయితే ఒక్క నెల కూడా ఆ ముగ్గురికి జీతాలు రాలేదు. మాకు జీతాలు రాలేదని మొదటి నెలలోనే ఆ ముగ్గురు యువకులు ఆ వైసీపీ కౌన్సిలర్ ని అడిగారు. ఐదు నెలల తర్వాత ఓకే సారి మీ జీతం మొత్తం వస్తుందని ,అంతవరకు వేచి చూడాలని, నేను మునిసిపల్ కమిషనర్ తో మాట్లాడానని ఆ వైసీపీ కౌన్సిలర్ ఈ ముగ్గురికి మాయమాటలు చెప్పాడు. అయితే రెండు సంవత్సరాలు అయినా జీతాలు వారి చేతికి రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, పలమనేరు మున్సిపాలిటీకి కొత్త కమిషనర్ రావడంతో ఈ ముగ్గురిని ఉద్యోగాల నుండి తొలగించారు.

A YCP councilor who cheated by taking money saying that he would be given jobs in the municipality

ఉద్యోగాలు పోయాయని ఆ ముగ్గురు ఆ వైసీపీ కౌన్సి కౌన్సిలర్ దగ్గరికి వెళ్లారు. తన చేతుల్లో ఏమీ లేదని, తర్వాత చూద్దాంలే అంటూ ఆ వైసీపీ కౌన్సిలర్ ఇన్ని రోజులు కాలం గడిపేశాడు. మోసపోయామని తెలుసుకున్న అన్వర్ బాషా, ముబారక్, సమీర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆశ్రయించారు. ఆ వైసీపీ కౌన్సిలర్ చేసిన మోసాన్ని టీడీపీ నాయకులు పలమనేరు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో కూడా తనకు తెలీదని, వాళ్లు వైసీపీ కౌన్సిలర్ కు డబ్బులు ఇచ్చిన విషయం తనకు తెలియదని, ఎవరికి డబ్బులు ఇచ్చారో వారి దగ్గర ఆ డబ్బులు వసూలు చేసుకోవాలని పలమనేరు మున్సిపల్ ప్రస్తుత కమిషనర్ తేల్చి చెప్పడంతో ఆ ముగ్గురు వ్యక్తులు షాక్ అయ్యారు. రెండు సంవత్సరాలు పని చేసినా జీతాలు రాకపోవడంతో కనీసం మేము వచ్చిన రూ. 4 లక్షలు మాకు తిరిగి ఇప్పిస్తే చాలని ఆ యువకులు ఇప్పుడు టీడీపీ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఈ విషయంలో చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు మౌనంగా ఉండిపోవడం తీవ్ర చర్చకుదారితీసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+