ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి: సూసైడ్ యత్నం

పోలీసుల కథనం ప్రకారం.. లింగంపేటకు చెందిన స్నేహ(18) ఆర్‌కె కళాశాలలో బి.కాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న తోటి విద్యార్థి సాయికిరణ్ రెడ్డి గత కొంత కాలంగా తనను ప్రేమించమంటూ ఆమెను వేధిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆమెతో గొడవకు దిగాడు. తనను ప్రేమించడం లేదని ఆగ్రహంతో కత్తితో స్నేహపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె మెడ, చేతికి గాయాలు అయ్యాయి. అనంతరం అదే కత్తితో తానూ గాయపర్చుకున్నాడు.
గమనించిన ఇతర తోటి విద్యార్థులు, కాలేజీ యాజమాన్యం హుటాహుటిన వారిద్దరినీ కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం స్నేహను నిజామాబాద్‌కు, సాయికిరణ్ రెడ్డిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications