షాక్: ఐఫోన్ కోసం రైలు నుంచి దూకేశాడు
చిత్తూరు: ప్రస్తుత కాలం యువత మొబైల్ ఫోన్లకు బానిసలైపోతున్నారు. ఎప్పుడూ వాటితో ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఘటన యువత.. మొబైల్ ఫోన్లకు ఎంతగా బానిసలయ్యారో తెలుపుతోంది. రైల్లో ప్రయాణిస్తున్న యువకుడి మొబైల్ ఫోన్.. పొరపాటున కిందపడటంతో ఎలాంటి ఆలోచన చేయకుండా అతడు కిందికి దూకేశాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. రాజంపేట మండలం కూచివారిపల్లెకు చెందిన నెక్కం రవితేజచౌదరి అనే యువకుడు చిత్తూరు జిల్లా పుత్తూరువద్ద ఒక ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఇతను బుధవారం ఉదయం తిరుపతికి వెళ్లడానికి రాజంపేట రైల్వేస్టేషన్లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు.

రైలుపెట్టెలో డోర్ వద్ద కూర్చుని మొబైల్ ఫోన్లో ఆట ఆడుతున్నాడు. రైలు ఓబులవారిపల్లె సమీపానికి వచ్చేసరికి పొరపాటున మొబైల్ ఫోన్ చేయిజారి కిందపడిపోయింది. దీంతో వెంటనే అతనుకూడా రైలునుంచి దూకేశాడు. దీంతో అతడి నడుము, తలవద్ద గాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు వెంటనే 108కి ఫోన్‌చేసి రైల్వేకోడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, విద్యార్థి తల్లిదండ్రులిద్దరూ కువైట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. విలువైన ఐఫోన్ కావడంతో దానికోసం దూకేసినట్లు విద్యార్థి 108 సిబ్బందితో తెలుపడం గమనార్హం. ఎంత ఐఫోన్ అయితే మాత్రం ప్రాణం కన్నా ఎక్కువ కాదు కదా.. అని అతనికి హితబోధ చేశారు స్థానికులు. రైలు స్లోగా కదులుతున్నందున అతను గాయాలతో బయటపడ్డాడని చెప్పారు.












Click it and Unblock the Notifications