ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు: తీరా పెళ్లి సమాయానికి ఉడాయించాడు
విశాఖపట్నం: ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. అంతేగాక, తను ప్రేమించిన యువతి తల్లిదండ్రులను కూడా తమ పెళ్లికి ఒప్పించాడు. ఇప్పటి దాకా బాగానే ఉంది. అయితే మరో కొద్ది గంటల్లో వారి వివాహం జరుగుతుందనగా, పెళ్లి మండపం నుంచి పరారయ్యాడు ఆ యువకుడు. ఈ పరిణామంతో వధువు కుటుంబసభ్యులు దిగ్ర్బాంతికి గురయ్యారు.
ఈ ఘటన విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం రామన్నపాలెంకు చెందిన యువకుడు మాటూరుకు చెందిన సదరు యువతి ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల వారు పెళ్లికి అంగీకరించి, ఆహ్వాన పత్రాలతోపాటు అన్ని సిద్ధం చేసుకున్నారు. గురువారం అన్నవరంలో వీరిద్దరికి వివాహాం జరిపించడానికి పెద్దలు ఏర్పాట్లు కూడా చేశారు.
బయటకు వెళ్లి వస్తానని చెప్పిన ఆ యువకుడు సాయంత్రం వరకు తిరిగిరాలేదు. దీంతో యువతి అచ్యుతాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications