ఆరా మస్తాన్ లెక్కలతో సహా మొత్తం బయటకు తీస్తున్నారే..!
ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లోనే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనే ఆరోపణలు ప్రధానంగా వినిపించాయి.తాజాగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దీనిపై చర్చ మరింత జోరుగా జరుగుతోంది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్టు ఆధారాలు సైతం బయటకు వచ్చాయి. పోలైన ఓట్ల కన్నా, లెక్కించిన ఓట్లే అధికంగా ఉండటంతో ఈవీఎంలపై పలు అనుమానాలు తలెత్తాయి.తాజాగా ఈవీఎం ట్యాంపరింగ్ గురించి ప్రముఖ సర్వే అధినేత ఆరా మస్తాన్ సంచలన విషయాలు బయటపెట్టారు.
ఎన్నికల పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే ఫామ్ 20ని అధికారిక వెబ్ సైట్‌లో ఉంచాలని, దీన్ని ఆప్‌లోడ్ చేయడానికి 109 ఎందుకు సమయం పట్టిందని ఎన్నికల సంఘాన్ని ఆరా మస్తాన్ ప్రశ్నించారు. హిందూపుర్ పోలింగ్ బూత్ 28లో వైసీపీ అభ్యర్థి దీపికకు కేవలం ఒక్క ఓటు మాత్రమే నమోదైందని ఆయన తెలిపారు. అదే పోలింగ్ బూత్‌తో పార్లమెంట్‌కు వచ్చేసరికి వైసీపీ అభ్యర్థికి 472 ఓట్లు నమోదయ్యాయని ఆరా మస్తాన్ తెలిపారు. పలు పోలింగ్ బూత్‌లలో సైతం ఇలాగే జరిగిందని ఆయన లెక్కలతో సహా బయటపెట్టారు.ఇలా పలు బుత్‌లలో చాలా ఓట్లు తారుమారు అయ్యాయని ఆయన వివరించారు.

ఇది ఎలా సాధ్యమంటూ ఎన్నికల కమిషన్‌ను ఆయన ప్రశ్నించారు.అంతేకాకుండా ఏపీలో కొత్త ఈవీఎంలను వాడారని ఆయన తెలిపారు. ఈవీఎం ప్యాలెట్ స్లిప్ మనకు కనిపించడానికి మూడు సెకన్లు పడుతుందని ప్రొగ్రామ్‌లో రాశారని, కానీ వాస్తవానికి అది కనిపించడానికి 7 సెకన్లు పడుతుందని, అలా ఎందుకు జరిగిందో ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వాలని ఆరా మాస్తాన్ కోరారు.పోలింగ్ శాతంపై కూడా ఆరా మస్తాన్ అనుమానం వ్యక్తం చేశారు. ఏపీలో ఎన్నికల ఓటింగ్ శాతాన్ని కూడా మూడు రోజుల తర్వాత బయటపెట్టారని ఆరా మస్తాన్ తెలిపారు. దీనికి ఎందుకు అంత సమయం తీసుకున్నారో చెప్పాలని ఆరా మస్తాన్ ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు.
ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తిరిగి విజయం సాధిస్తుందని చెప్పిన వారిలో ఆరా సర్వే కూడా ఒకటి. ఏపీలో వైసీపీ 110 సీట్లను గెలుచుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు. కానీ ఏపీలో తిరిగి జగన్ సీఎం అవుతారని ఆరా మస్తాన్ చెప్పిన అంచనాలు తప్పాయి. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవి చూసింది. కూటమి ఏకంగా 164 సీట్లతో విజయం సాధించింది. అధికార వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఆరా సర్వే ఫెయిల్ కావడంతో ఆరా మస్తాన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఏకంగా ఈవీఎంలపైనే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారాయన.












Click it and Unblock the Notifications