వైసీపీని నిండా ముంచిన ఆరా మస్తాన్

2024వ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని రోజుల్లో 2025 మొదలుకాబోతుంది. ఈ సమయంలో 2024లో చాలానే మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. అనేక రకాల సంఘటనలు ఈ 2024లో చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నుంచి ఒలింపిక్స్ వరకు, ఐపీఎల్ నుంచి వరల్డ్ కప్ వరకు ఇలా అనేక రకాల సంఘటనలు ఈ 2024లో చోటు చేసుకున్నాయి. అలాగే ఎంతో మంది ఈ సంవత్సరం సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు.

అలా వైరల్ అయిన వారిలో ప్రముఖ వ్యక్తి ఆరా సంస్థల అధినేత ఆరా మస్తాన్ కూడా ఒకరు.వైసీపీ తిరిగి విజయం సాధిస్తుందని చెప్పిన వారిలో ఆరా సర్వే కూడా ఒకటి. గత 15 ఏళ్లుగా చేసిన సర్వేల్లో ఆరా చెప్పిన ఫలితాలే రావడంతో మెజార్టీ ప్రజలు ఆయన ఆ సంస్థ చెప్పిన ఫలితాలే వస్తాయని భావించారు.ఆరా సంస్థల అధినేత ఆరా మస్తాన్ చేసే సర్వేకు ఓ నిబద్ధత ఉంటుంది. ఆయన చేసిన సర్వే ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు. ఏపీలో వైసీపీ 110 సీట్లను గెలుచుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు. తన సర్వే నిజం అవుతుందని.. మరోసారి జగనే సీఎం అని ఆయన బల్ల గుద్ది మరి చెప్పడం జరిగింది.

Aara Mastan Fail in AP Elections Survey

దీంతో ఆరా మస్తాన్ సర్వే తర్వాత వైసీపీ అనుకూలంగా భారీ ఎత్తున బెట్టింగ్‌లు కూడా జరిగాయి. కానీ ఏపీలో తిరిగి జగన్ సీఎం అవుతారని ఆరా మస్తాన్ చెప్పిన అంచనాలు తప్పాయి. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవి చూసింది.కూటమి ఏకంగా 164 సీట్లతో విజయం సాధించింది. అధికార వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఆరా సర్వే ఫెయిల్ కావడంతో ఆరా మస్తాన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఆరా మస్తాన్ జగన్‌ను గుడ్డిగా నమ్మడంతోనే అతి విశ్వాసానికి వెళ్లాడని విమర్శలొచ్చాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ఆరా మస్తాన్ పూర్తిగా సైలెంట్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+