ఈవీఎంలను ఎలా ట్యాంపర్ చేయవచ్చో టీడీపీకి క్లియర్‌గా తెలుసు- డెమో కూడా ఇచ్చారు: ఆరా మస్తాన్

Aaraa Mastan: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత దేశవ్యాప్తంగా మరోసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై ఎన్నో అనుమానాలు తలెత్తుతోన్నాయి. ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ల వ్యవస్థను ప్రవేశపెట్టాలనే తెరమీదికి వచ్చింది. ఈ డిమాండ్ ఊపందుకుంటోంది.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్‌లో సునామీ సృష్టించిన ఆ పార్టీ..ఈవీఎంలను తెరిచిన తరువాత కుప్పకూలింది. ఈవీఎం కౌంటింగ్‌ ఆరంభమైన తరువాత భారతీయ జనతా పార్టీ దూసుకెళ్లింది. భారీ మెజారిటీని సాధించింది.

Aaraa Mastan made key remarks on EVM s tampering

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తొలి గంటలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 71 నియోజకవర్గాల్లో ఆధిక్యతలో కొనసాగారు. ఆ తరువాత ఫలితాలు తారుమారు అయ్యాయి. బీజేపీ ఒక్క ఉదుటున ఆధిక్యతను సాధించింది. ఈవీఎంలల్లో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ కాంగ్రెస్ ఆధిక్యత భారీగా తగ్గుతూ వచ్చింది.

అప్పటివరకు కనీసం పోటీ ఇవ్వలేని స్థితిలో కనిపించిన బీజేపీ ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. చివరికి- 48 సీట్లతో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది హర్యానాలో. 71 స్థానాల్లో ఆధిక్యతలో కనిపించిన కాంగ్రెస్ 37 నియోజకవర్గాలకే పరిమితమైంది. ఈ పరిణామాలను కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. ఈవీఎంల పనితీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది.

తాజాగా ఎన్నికల సర్వే సంస్థ ఆరా చీఫ్ ఆరా మస్తాన్ సైతం ఇదే అంశంపై మాట్లాడారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. గతంలో చంద్రబాబు నాయుడు, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు ఈవీఎంల ట్యాంపరింగ్‌పై స్పందించాయని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఈవీఎంల గురించి మాట్లాడట్లేదని గుర్తు చేశారు.

ఎలాన్ మస్క్, శామ్ పిట్రోడా.. పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈవీఎంలను ఎలా ట్యాంపర్ చేయవచ్చంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన వేమూరి హరిప్రసాద్, ఇప్పటి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో కలిసి ఎన్నికల కమిషన్ అధికారుల ముందే ఓ డెమాన్‌స్ట్రేషన్ కూడా ఇచ్చారని పేర్కొన్నారు. వాళ్లే తనను కలిసి డెమో ఇచ్చారనీ అన్నారు.

ఈవీఎంల ట్యాంపరింగ్‌ను ఎలా నిరోధించాలనే విషయంపై ఇప్పటివరకు కూడా ఈసీ దృష్టి పెట్టినట్లు కనిపించట్లేదని ఆరా మస్తాన్ అన్నారు. దానిపై కాకుండా ఎవరు ఎన్నిరకాలుగా మాట్లాడినా స్పందించకపోవడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఈ పరిణామం ఎన్నికల కమిషన్‌పై ఓ మచ్చలా మారుతుందని వ్యాఖ్యానించారు.

ఈవీఎంలను ఎలా ట్యాంపర్ చేయవచ్చనే విషయాన్ని వివరించారు. తాము ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాల్లో కాకుండా మెజారిటీ బాగా తగ్గుతుందనుకున్న స్థానాల్లో ట్యాంపర్ చేస్తారని ఆరా మస్తాన్ అన్నారు. ఒక నియోజకవర్గంలో 200 బూత్‌లు ఉన్నాయనుకుంటే ఏ బూత్‌లో 50 శాతం కంటే తక్కువగా ఓట్లు వస్తాయో వాటిపైనే దృష్టి పెడతారని చెప్పారు.

తాము ట్యాంపర్ చేయదలచుకున్న బూత్‌ పరిధిలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? వాటిల్లో ఎన్ని పోల్ అయ్యాయి? గత ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎంత? అనే విషయాన్ని ఆధారంగా చేసుకుంటామని, ఈవీఎంల ట్యాంపరింగ్‌పై డెమో ఇచ్చిన వాళ్లు వివరించారని ఆరా మస్తాన్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+