జగన్ పై ఏబీ అస్త్రం - తెర వెనుక, అక్కడే బిగ్ ట్విస్ట్.!!
ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యూహాలు అమలు చేస్తోంది. అటు జగన్ సైతం కూటమి పైన పోరుబాటకు సిద్దం అయ్యారు. ఇదే సమయంలో జగన్ పైన పోరాటానికి మరో మాజీ ఐపీఎస్ రంగంలోకి దిగారు. రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటిస్తూనే జగన్ తన లక్ష్యమని స్పష్టం చేసారు. పార్టీ పైన స్పష్టత ఇవ్వలేదు. అయితే, కూటమి ప్రభుత్వం ఇచ్చిన నామినేటెడ్ పోస్టు వద్దనుకొని రాజకీయాల్లోకి ఏబీ రావటం వెనుక కారణం ఏంటి. అసలు ఏం జరుగుతోంది.
జగన్ హయాంలో
ఏబీ వెంకటేశ్వర రావు. సీనియర్ ఐపీఎస్ అధికారిగా పదవీ విరమణ చేసారు. జగన్ హయాంలో పోస్టింగ్ లేకుండా దూరంగా ఉన్నారు. 2014 లో చంద్రబాబు సీఎం అయిన తరువాత నాడు తొలుత అనూరాధను నిఘా చీఫ్ గా నియమించారు. ఆనురాధ తరువాత ఏబీ వేంకటేశ్వర రావు ఇంటలిజెన్స్ చీఫ్ గా 2019 ఎన్నికల వరకు వ్యవహరించారు. ఇక.. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఏబీ వెంకటేశ్వర రావు పైన విచారణలు..సస్పెన్షన్లు కొనసాగించారు. ఏబీ సైతం న్యాయ స్థానం ద్వారా తన పోరాటం సాగించారు. వైసీపీ హయాంలో నాలుగేళ్ల పాటు సస్పెన్షన్ లో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరించారు. అదే విధంగా కూటమి ప్రభుత్వం ఆయనకు నామినేటెడ్ పదవి కట్టబెట్టింది.

రాజకీయ ఎంట్రీ..
ఏబీకి ఇచ్చిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యా . ఆయనకు ఆ పదవి సరి కాదనే అభిప్రాయం వ్యక్తం అయింది. ఇప్పటి వరకు ఆయన తనకు కేటా యించిన పదవి బాధ్యతలు స్వీకరించలేదు. టీడీపీ అధినాయకత్వం నిర్ణయం పైన కేడర్ సైతం ఏబీ విషయంలో ఇచ్చిన పదవి పైన విభేదించింది. కాగా, ఇప్పుడు ఏబీ వెంకటేశ్వర రావు తాజాగా పొలిటికల్ ఎంట్రీ చేస్తున్నట్లు ప్రకటించారు. మెరుగైన సమాజం కోసం పాటుపడేందుకే వస్తున్నాని , అంతేకానీ పదవులు ఆశించి మాత్రం కాదని వెల్లడించారు. జగన్ తో తనకు విభేదాలు, వ్యక్తిగత కక్షలు లేవని చెప్పారు. అయితే జగన్ అక్రమాలను మాత్రం కచ్చితంగా బయటకు తెస్తానని పేర్కొన్నారు. కోడికత్తి శ్రీను కుటుంబాన్ని పరామర్శించారు. తనకు ఇదో కొత్త అధ్యాయమన్న ఆయన.. జగన్ అక్రమాలను వదిలిపెట్టేది లేదన్నారు.
అస్త్రాలు సిద్దం
జగన్ అక్రమాలకు సంబంధించి పూర్తి సమాచారం తన వద్ద ఉందని ఏబీ చెబుతున్నారు. జగన్ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం సండూర్ పవర్‌తో మొదలై ఇప్పుడు లక్షల కోట్లకు చేరిందన్నారు. ఆ కంపెనీలోకి ఖాతాలోకి విదేశాల నుంచి నగదు చేరిందని.. అదంతా ప్రజల డబ్బేనన్నారు. దోచుకున్న సొమ్మును చట్టపరంగా కక్కిస్తామన్నారు. జగన్ బాధితులకు ఎవరైనా 7816020048 వాట్సాప్ నంబర్ ద్వారా సమాచారం ఇవ్వొచ్చన్నారు. అయితే, టీడీపీ కాదని.. ఇప్పుడు రాజకీయం గా తాను ఏ పార్టీలో చేరాలా.. కొత్త పార్టీ పెట్టాలా అనేది నిర్ణయించలేదని చెప్పటం ఆసక్తి కరంగా మారింది. కూటమిగా ఏర్పడి జగన్ పైన మూడు పార్టీలు విజయం సాధించాయి. ఇప్పుడు ఏబీ రాజకీయ లక్ష్యం జగన్ అయినప్పుడు.. ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతోంది. గతంలో ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ లు పెట్టిన పార్టీల గురించి విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మరి.. ఏబీ నిజంగా పార్టీ ప్రకటిస్తారా.. లేక, కూటమి పార్టీల్లో చేరుతారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications