"రాసిపెట్టుకోండి.. మేయర్ గా గెలుస్తున్నా..!"- విజయవాడ అభ్యర్ధి ట్వీట్..!

ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న స్ధానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి, విపక్ష వైఎస్సార్సీపీ మధ్య పలుచోట్ల హోరాహోరీ పోరు నెలకొంది. కానీ విజయవాడలో మాత్రం వీరిద్దరికీ స్వతంత్ర అభ్యర్ధి అయిన ఏబీ వెంకటేశ్వరరావుకూ (AB Venkateswara Rao) మధ్య ముక్కోణపు పోటీ జరుగుతోంది. జనసేన అభ్యర్ధి వంగవీటి రాధాకృష్ణ కూటమి తరఫున, రాయన భాగ్యలక్ష్మీ వైఎస్సార్సీపీ తరఫున విజయవాడ మేయర్ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఏబీవీ ఎఫెక్ట్- కేబినెట్లో చంద్రబాబు కీలక ఆదేశాలు..!
ఏబీవీ ఎఫెక్ట్- కేబినెట్లో చంద్రబాబు కీలక ఆదేశాలు..!

ఇప్పటికే కాపు అభ్యర్ధి అయిన వంగవీటి రాధాకృష్ణ, బీసీ అభ్యర్ధి అయిన రాయన భాగ్యలక్ష్మికి పోటీగా స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వరరావు రోజుకో సంచలనం రేపుతున్నారు. విజయవాడ నగరంలో కాపు, కమ్మ వర్గాల మధ్య పోరుగా ఈ ఎన్నికలు నిలుస్తున్నాయన్న ప్రచారం నేపథ్యంలో వంగవీటి రాధాని తాజాగా కలిసి మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు తమ మధ్య ఎన్నికల పోటీ తప్ప ఇంకేమీ లేదని తేల్చిచెప్పేశారు. దీంతో కుల సమీకరణాలు, రాజకీయాల చర్చ కాస్త తగ్గింది. ఇదే క్రమంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇవాళ ఎక్స్ లో ఓ ట్వీట్ చేశారు.

AB Venkateswara Rao s Confident Tweet Ahead of Vijayawada Mayor Election Draws Attention
కూటమి లెక్కల్ని మార్చబోతున్న ఏబీ వెంకటేశ్వరరావు? గెలిచినా, ఓడినా?
కూటమి లెక్కల్ని మార్చబోతున్న ఏబీ వెంకటేశ్వరరావు? గెలిచినా, ఓడినా?

రాసి పెట్టుకోండి... మేయర్ గా గెలుస్తున్నా.. చరిత్ర సృష్టించబోతున్నా...! అంటూ ఏబీ వెంకటేశ్వరరావు ఇవాళ సంచలన ట్వీట్ చేశారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీల మధ్దతుతో స్వతంత్ర అభ్యర్ధిగా దిగిన ఏబీవీ.. ఈ రేంజ్ లో ముక్కోణపు పోటీలో గెలుస్తున్నట్లు చేసిన ప్రకటన సహజంగానే తన ప్రత్యర్దులు వంగవీటి రాధ, రాయన భాగ్యలక్ష్మికి సవాలు విసిరేలా ఉంది. ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో నగరంలో చురుగ్గా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్న ఏబీ వెంకటేశ్వరావు ఇవాళ ఏకంగా తానే గెలుస్తున్నట్లు చేసిన ప్రకటనపై ఇంకా ఆయన ప్రత్యర్దులు స్పందించలేదు. అయినా ఇంత ధైర్యంగా సోషల్ మీడియాలోనే ఏబీ చేసిన ప్రకటన ఆయన పక్కా ప్లాన్ తోనే ఉన్నట్లు తెలియజేసేలా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+