వంగవీటి నిర్ణయం సరైనదేనా ? బెజవాడలో చర్చ- తెరపైకి గత అనుభవాలు..!

దివంగత కాపు నేత వంగవీటి మోహన రంగా తనయుడైన వంగవీటి రాధాకృష్ణ(vangaveeti radha) తాజాగా టీడీపీని వీడి జనసేనలో చేరారు. కూటమిలోనే ఉన్న టీడీపీని వీడి, అదే కూటమిలో ఉన్న జనసేనలో చేరినా ఈ రెండు పార్టీల నుంచీ రాధా చేరికపై ఎలాంటి స్పందనలూ లేవు. విజయవాడ మేయర్ అభ్యర్దిగా స్దానిక ఎన్నికల్లో రాధాను నిలబెట్టాలన్న కూటమి నిర్ణయమే ఇందుకు కారణం. ఇంత వరకూ బాగానే ఉన్నా ఒకప్పుడు రాజ్యసభ ఎంపీ, మంత్రి, ఎమ్మెల్సీ ఇస్తారన్న ప్రచారాల నుంచి ఇప్పుడు మేయర్ స్థాయికి ఈ మాజీ ఎమ్మెల్యే పడిపోవడం ఏంటనే చర్చ బెజవాడలో జరుగుతోంది. అన్నింటి కంటే మించి గతంలో రాజకీయంగా తీసుకున్న పలు నిర్ణయాలతో ప్రస్తుతం ఈ స్ధానంలో ఉన్న రాధ.. ఇప్పుడు మరో రాజకీయ తప్పిదం చేస్తున్నారా అన్న చర్చ కూడా మొదలైంది. దీని వెనుక పలు కీలక కారణాలే ఉన్నాయి.

వంగవీటి రాధాపై వైసీపీ అభ్యర్ధి ఆయనేనా? కీలకంగా కుల సమీకరణం- జగన్ ఛాయిస్..!
వంగవీటి రాధాపై వైసీపీ అభ్యర్ధి ఆయనేనా? కీలకంగా కుల సమీకరణం- జగన్ ఛాయిస్..!

ఒకప్పుడు విజయవాడ కేంద్రంగా రాజకీయాలు నడిపి రాష్ట్రవ్యాప్తంగా కాపు సామాజిక వర్గానికి ఆరాధ్యుడిగా నిలిచిన వంగవీటి మోహన రంగాను ఎదగనీయకుండా కమ్మ సామాజిక వర్గ నేతలు అడ్డుపడుతున్న క్రమంలో ఆయన హత్య జరిగింది. ఆ తర్వాత ఆయన భార్య రత్నకుమార్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆమె తర్వాత కుమారుడు వంగవీటి రాధాకృష్ణ రంగా వారసుడిగా తెరపైకి రావడమే కాకుండా ఎమ్మెల్యేగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇంతవరకూ బాగానే ఉన్న రాధ కెరీర్ ఆ తర్వాతే మసకబారడం ప్రారంభమైంది. దీనికి కారణం ఆయన ఎంచుకున్న మార్గం, తీసుకున్న నిర్ణయాలే.

Will Vangaveeti Radha Repeat His Past Mistakes Jana Sena Move and Vijayawada Mayor Ambition Spark Debate
జనసేనలోకి వంగవీటి..! బెజవాడ మేయర్ సీటు-తిరుపతి మేయర్ అభ్యర్ధీ చేరిక..!
జనసేనలోకి వంగవీటి..! బెజవాడ మేయర్ సీటు-తిరుపతి మేయర్ అభ్యర్ధీ చేరిక..!

2009లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరి విజయవాడ సెంట్రల్ స్ధానం నుంచి పోటీ చేసిన వంగవీటి రాధ ఓడిపోయారు. ఆ తర్వాత మూడేళ్లలోనే ప్రజారాజ్యం పార్టీ నడపలేక చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేయగా.. రాధా మాత్రం తిరిగి సొంత పార్టీకి వెళ్లలేక సైలెంట్ గా ఉండిపోయారు. తిరిగి 2012లో జగన్ పెట్టిన వైఎస్సార్సీలో చేరిన రాధాకు 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు టికెట్ ఇచ్చినా గెలవలేదు. అయినా 2019లో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే లేదా బందరు ఎంపీ సీటు ఇస్తామని వైసీపీ ఆఫర్ చేసినా కాదని, సెంట్రల్ సీటే కావాలని ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసిన రాధా.. ఒకప్పుడు తన తండ్రిని చంపారని ఆరోపించిన టీడీపీలో చేరిపోయారు. అయినా టీడీపీ 2019, 2024 ఎన్నికల్లో రాధాకు అసెంబ్లీ, లోక్ సభ సీటు కూడా ఇవ్వకుండా కేవలం ప్రచారానికి వాడుకుంది. దీంతో రాధా తీసుకున్న వరుస నిర్ణయాలు రాజకీయ తప్పిదాలుగా మిగిలిపోయాయి. చివరికి గత ఎన్నికల్లో కూటమి గెలిస్తే మంచి పదవి ఇస్తామన్న ఆఫర్ తో ప్రచారం చేయించుకుంది. కూటమి గెలిచినా రెండున్నరేళ్లుగా ఎలాంటి పదవీ ఇవ్వని టీడీపీ.. ఇప్పుడు విజయవాడ మేయర్ గా రాధాను నిలబెట్టేందుకు వీలుగా జనసేనలోకి పంపింది.

Will Vangaveeti Radha Repeat His Past Mistakes Jana Sena Move and Vijayawada Mayor Ambition Spark Debate
వంగవీటి రాధ ఎంట్రీ వేళ సామినేనికి షాక్- జనసేన ఆఫీసు గేటు వద్దే..!
వంగవీటి రాధ ఎంట్రీ వేళ సామినేనికి షాక్- జనసేన ఆఫీసు గేటు వద్దే..!

ఈ నిర్ణయంపై వంగవీటి అభిమానులు, కాపు సంఘాల పెద్దలు, చివరికి రాధా అనుచరుల్లోనూ అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం టీడీపీ ఉద్దేశపూర్వకంగా రాధాను జనసేన పార్టీలోకి పంపి, కూటమి తరఫున మేయర్ గా నిలబెట్టి బలి పశువును చేయబోతున్నట్లు వారు అనుమానిస్తున్నారు. లేకపోతే వంగవీటి రంగా వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రాధాకృష్ణ.. తండ్రి పేరు, ఆశయాలను నిలబెడుతూ రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పాల్సిన వ్యక్తి అయినా.. కేవలం మేయర్ పదవి కోసం జనసేన గూటికి చేరడం సరికాదనే వాదన వినిపిస్తోంది. సామాజిక వర్గ పరంగా చూసినా విజయవాడ మేయర్ గా రాధాకు ఏమాత్రం ఓట్లు పడతాయో తెలియని పరిస్ధితి. ఒకవేళ మేయర్ గా పోటీ చేసి ఓడితే, అదే కారణంతో భవిష్యత్తులో ఇంకే పదవులు ఇవ్వకుండా వదిలేయొచ్చనే ఆలోచన కూడా ఉందోమో అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇదే అదనుగా కమ్మ సామాజిక వర్గ ఓట్లను చీల్చేందుకు వైసీపీ దేవినేని అవినాష్ ను మేయర్ గా పోటీ చేయించబోతుందన్న సంకేతాలు ఇస్తోంది. అదే జరిగితే రాధా నిర్ణయం సరైందా కాదా అన్నది మరోసారి తేలిపోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+