కూటమి కంచుకోటల్లో మేయర్ అభ్యర్దులను ఖరారు చేసిన జగన్..!!

ఏపీలో స్థానిక సమరం మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో మున్సిపల్ బరిలో నిలిచే అభ్యర్దుల ఖరారు పై తుది కసరత్తు జరుగుతోంది. కూటమిలో ఇప్పటికే ఏ పార్టీ ఏ స్థానం లో పోటీ చేయాలో నిర్ణయానికి వచ్చారు. మాజీ సీఎం జగన్ ఎన్నికల వ్యూహాలు.. అభ్యర్దుల ఖరారు పై సుదీర్ఘ కసరత్తు చేసారు. ఇక.. ఇప్పుడు కూటమి పార్టీల పోటీ పైన స్పష్టత రావటంతో.. తమ పార్టీ అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా మేయర్ అభ్యర్దులను ప్రకటిస్తున్నారు.

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అటు కూటమి.. ఇటు వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఏకపక్షంగా విజయం సాధించి.. వైసీపీకి ఎక్కడా అవకాశం ఇవ్వకూడదని కూటమి పార్టీలు భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు.. ఓటములు ఎలా ఉన్నా తమ బలం చాటుకోవాలని వైసీపీ డిసైడ్ అయింది. అందులో భాగంగా జిల్లాల వారీగా మాజీ సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలతో ఒన్ టు ఒన్ సమావేశాలు నిర్వహించారు. అభ్యర్దుల ఎంపిక పైన కీలక దిశా నిర్దేశం చేసారు. ముందుగా నెల్లూరు మేయర్ అభ్యర్దిని ప్రకటించారు. ఇక.. ఇప్పుడు కూటమి గత ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించిన మరో రెండు నగరాల్లో మేయర్ అభ్యర్దులను ఫిక్స్ చేసారు. స్థానికంగా మిగిలిన ఆశావాహులతో చర్చల తరువాత వీరి పేర్లను అధికారికంగా ప్రకటన చేసేందుకు రంగం సిద్దమైంది.

సీట్ల సర్దుబాటులో పవన్ కోరుకున్నట్లే జరిగిందా..? అక్కడే అసలు ట్విస్ట్..!!
సీట్ల సర్దుబాటులో పవన్ కోరుకున్నట్లే జరిగిందా..? అక్కడే అసలు ట్విస్ట్..!!
ys-jagan-finalises-ysrcp-mayor-candidates-for-visakhapatnam-and-guntur-here-the-details

అభ్యర్దుల ఖరారు పై జగన్ తుది కసరత్తు

వైసీపీ నుంచి విశాఖ, గుంటూరు మేయర్ అభ్యర్దుల పైన స్పష్టత వచ్చింది. విశాఖ మేయర్ అభ్యర్దిగా ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పేరు ఖరారు చేసినట్లు సమాచారం. గ్రేటర్ విశాఖ రాజకీయ చరిత్రలో మహిళా మేయర్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటివరకు ఇద్దరు మహిళలు ఈ పదవిలో బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ నుంచి విశాఖ ఎంపీ శ్రీభరత్ భార్య తేజస్విని పేరు తొలుత ప్రచారంలోకి వచ్చినా.. తరువాత పార్టీ నేతలే తేజస్విని పోటీలో ఉండరని స్పష్టత ఇచ్చారు. కాగా.. పల్లా శ్రీనివాసరావు భార్య లావణ్య తో పాటుగా మరో ప్రముఖ వ్యాపార వేత్త పేరు రేసులోకి వచ్చింది. దీంతో.. సామాజిక సమీకరణాల ఆధారంగా వరుదు కల్యాణి పేరు ఖరారు చేసినట్లు సమాచారం. ఇక, గుంటూరు నుంచి నూరీ ఫాతిమా పేరు ఖరారైంది. ప్రస్తుతం గుంటూరు తూర్పు ఇంఛార్జ్ గా ఉన్న నూరీ ఫాతిమాను మేయర్ బరిలో దింపాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడ తూర్పు నియోజక వర్గంలో ముస్లిం మైనార్టీ ఓట్లు గణనీయంగా ఉండటంతో ఈ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ పేర్లను పార్టీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+