ABP C Voter Opinion Poll: ఏపీలో ఓటర్ల మొగ్గు అటే..! భారీ ఆధిక్యంలో-మరో జాతీయ సర్వే..!
ఏపీలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలపై పలు మీడియా సంస్ధలు, ఏజెన్సీలు తమదైన రీతిలో సర్వేలు, ఒపీనియన్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. వీటిలో పలు సర్వేలు అధికార వైసీపీకి మొగ్గు చూపుతుండగా.. మరికొన్ని టీడీపీ, జనసేన, బీజేపీతో కూడిన ఎన్డీయే కూటమి ఆధిక్యాన్ని అంచనా వేస్తున్నాయి. ఇదే క్రమంలో మరో జాతీయ మీడియా సంస్ధ తన తాజా సర్వే ఫలితాలను విడుదల చేసింది. గతంలో పలు జాతీయ మీడియా ఛానళ్లు అంచనా వేసిన ఫలితాలకు ఇది దగ్గరగా ఉంది.
ఏపీలో ఎన్నికలకు మరో 25 రోజులు మాత్రమే మిగిలున్న నేపథ్యంలో పబ్లిక్ మూడ్ ఎలా ఉందన్న దానిపై జాతీయ మీడియా ఛానల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్ధతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఫలితాలు విడుదల చేసింది. ఇందులో ఏపీలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీయే, దాని మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనకు స్పష్టమైన ఆధిక్యాన్ని ఇచ్చింది. అధికార వైసీపీపై ఎన్డీయే కూటమి ఆధిక్యం కొనసాగుతున్నట్లు సర్వే తేల్చిచెప్పింది.

ఎన్డీయేలో బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లు కైవసం చేసుకోబోతున్నట్లు ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ తేల్చింది. బీజేపీ ఒక్కటే ఐదు ఎంపీ సీట్లు గెల్చుకోబోతోందని, మిగిలిన ఐదు ఎంపీ సీట్లు వైసీపీ ఖాతాలో పడతాయని ఏబీపీ సర్వే స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఒక్క సీటు కూడా గెల్చుకునే అవకాశం లేదని ఈ సర్వే తేల్చేసింది. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 46.7 శాతం ఓట్లు సాధించబోతోందని, అలాగే వైసీపీకి 39.9 శాతం ఓట్లు రాబోతున్నాయని ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ తేల్చింది.












Click it and Unblock the Notifications