మహిళా ఎమ్మెల్యే, టీడీపీపై అభ్యంతరకర పోస్టులు: యువకుడి అరెస్ట్

Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయకులను, వ్యవహారాలను కించపరుస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టింగ్‌లు పెడుతున్నారన్న ఆరోపణలపై ఇప్పాల రవీంద్రరెడ్డి (34)అనే యువకుడ్ని విశాఖపట్నం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

రవీంద్రరెడ్డి బెంగళూరులోని రామ్మూర్తి నగర్‌లో నివసిస్తూ సౌదీ ఇండస్ట్రియల్‌ సర్వీసెస్‌ సంస్థలో సౌత్‌ ఇండియా, శ్రీలంక ప్రాంతాలకు సేల్స్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు.మే 11న పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వి అనితను ఉద్దేశించి కూడా అభ్యంతకర వ్యాఖ్యానాలు చేశారు.

anitha

దీంతో అనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో పోస్టులను పరిశీలించి లైంగిక వేధింపులు, అసభ్యకర వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో అశ్లీలమైన సందేశాలు ప్రచురించడం, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేక బృందం బెంగళూరు వెళ్లి రవీంద్రరెడ్డి(34)ని అదుపులోకి తీసుకుంది. బుధవారం నిందితుడ్ని వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A youth arrested for posting abusive messages in social media about Telugudesam Party.
Please Wait while comments are loading...