చంద్రబాబుకు కస్టడీనా, రిలీఫ్ దక్కేనా - జడ్జిమెంట్ డే, ఉత్కంఠ..!!
టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చేది ఎప్పుడు. ఇదే ఇప్పుడు చర్చగా మారుతోంది. అటు అసెంబ్లీ సమావేశాలు..ఇటు చంద్రబాబు రిమాండ్ సమయం ముగస్తున్న వేళ కోర్టులో ఈ రోజు చంద్రబాబు కస్టడీ పిటీషన్ పై నిర్ణయం వెలువడనుంది. సీడీఐ చంద్రబాబును అయిదు రోజుల కస్టడీ కోరింది. ఈ పిటీషన్ పైన కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అటు హైకోర్టులో క్వాష్ పిటీషన్ పైన తీర్పు రిజర్వ్ అయింది. ఇప్పుడు ఏసీబీ కోర్టు తీర్పు పై ఉత్కంఠ కొనసాగుతోంది.
స్కిల్ స్కాంలో విచారణలో చంద్రబాబును అయిదు రోజులు కస్టీడీకి ఇవ్వాలని సీఐడీ కోరింది. కేసులో అవినీతి జరిగినట్లు నిర్దారణ అయిందని..చంద్రబాబు నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని సీఐడీ వాదించింది. రూ 371 కోట్ల దుర్వినియోగం జరిగిందని కోర్టు ముందు పేర్కొంది. ఆన్ని ఆధారాలతోనే అరెస్ట్ జరిగిందని.. కేసుతో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కర్నీ మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందన్నారు. కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికితీయడమే అసలు ఉద్దేశమన్నారు. చంద్రబాబును కస్టడీకి ఇస్తే మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏఏజీ వాదనలు వినిపించారు. చంద్రబాబును విచారించటం ద్వారా అన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.

ఈ వాదనలతో చంద్రబాబు న్యాయవాది లూధ్ర విభేదించారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతి చేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవని.. ఆయన అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నారు లూథ్రా. ఎన్‌ఎస్‌జీ భద్రత ఉన్న వ్యక్తిని విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడమే కాకుండా కస్టడీకి కోరడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు రాజకీయ కుట్రతోనే జరిగిందని.. ఏసీబీ విచారణలో కొత్త కోణం ఇప్పటిదాకా ప్రవేశ పెట్టలేక పోయారని లూథ్రా వాదనలు వినిపించారు. ఈ క్రమంలో న్యాయమూర్తి జోక్యం చేసుకున్నారు. పీసీ యాక్ట్ 17ఏ అమెండ్‌మెంట్ కంటే ముందే కేసు నమోదు అయిందని చెప్పుకొచ్చారు.
ఇరువర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్ట్.. కస్టడీ పిటిషన్‌పై తీర్పును గురువారానికి వాయిదా వేసింది. అంతకుముందు పీటీ వారెంట్ల పిటిషన్లకు సంబంధించి ఒకేసారి విచారించాలని ఒత్తిడి తీసుకురావొద్దని ఏసీబీ కోర్ట్ స్పష్టం చేసింది. మరోవైపు అంగళ్లు కేసులో ఏపీ హైకోర్ట్‌లో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. ఈ కేసులో ఓ1గా ఉన్నారు చంద్రబాబు. ఈ పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది. అటు 12 రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు రిమాండ్ 22తో పూర్తి కానుంది. ఈ సమయంలో ఏసీబీ కోర్టు వెలువరించనున్న తీర్పు పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications