వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగళం: చీఫ్ ఇంజినీర్ అక్రమాస్తులు 100కోట్లకు పైనే!

మరో భారీ అవినీతి తిమింగలం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్ గంగాధరం ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ ఏకకాలంలో దాడులు నిర్వహించింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మరో భారీ అవినీతి తిమింగలం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్ గంగాధరం ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ ఏకకాలంలో దాడులు నిర్వహించింది.

గంగాధరం కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపై ఏసీబీ శనివారం తెల్లవారుజాము నుంచి దాడులు నిర్వహిస్తోంది. విశాఖపట్నం భీమిలి వద్ద నాలుగు వరుసల రహదారుల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ తనిఖీలు చేపట్టింది.

acb

హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరు, కడప, నెల్లూరు, చిత్తూరు, విశాఖలోని మొత్తం 20 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. రూ. 100 కోట్లకు పైగానే అక్రమస్తులు సంపాదించినట్లు ప్రాథమిక అంచనా. సోదాలు కొనసాగుతున్నాయి.

కాగా, గంగాధరంకు బినామీగా కొనసాగుతున్న మరో కాంట్రాక్టర్ విశ్వేశ్వరరావు ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, ఎవరో కావాలనే తనపై తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని విశ్వేశ్వరరావు అన్నారు. గంగాధరంతో వ్యక్తిగతంగా ఎలాంటి లావాదేవీలు లేవని చెప్పారు. తాను ఎవరికీ బినామీ కాదని అన్నారు. గంగాధరంతో ఆఫీసు, కాంట్రాక్టుల వరకే పరిమితమని అన్నారు.

English summary
ACB officials on Saturday raided in Andhra Pradesh R and B chief engineer houses in Andhra Pradesh and Telangana states and Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X