విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.500 కోట్ల ఆస్తులు: బయట తాళం వేసి ఇంట్లో, గాయత్రిని పట్టించిన ఏసీ

టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ రఘురామి రెడ్డి అక్రమాస్తుల కేసులో ఓ ఆసక్తికర విషయం. రఘు బినామీలు వెంకటశివప్రసాద్, గాయత్రి (వెంకటశివప్రసాద్ భార్య)లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ రఘురామి రెడ్డి అక్రమాస్తుల కేసులో ఓ ఆసక్తికర విషయం. రఘు బినామీలు వెంకటశివప్రసాద్, గాయత్రి (వెంకటశివప్రసాద్ భార్య)లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

చదవండి: ఏపీలో రూ.500 కోట్ల అవినీతి: ప్రేమ-పెళ్లి-అక్రమాలు, ఎవరీ రఘు, ప్రసాద్, గాయత్రి?

బయట తాళం వేసి లోపల ఉన్న గాయత్రి

బయట తాళం వేసి లోపల ఉన్న గాయత్రి

సోదాల సమయంలో ఏసీబీ అధికారులకు చిక్కకుండా ఉండేందుకు గాయత్రి ఇంటి బయట తాళం వేసి, ఇంటి లోపల దాక్కుంది. కానీ ఏసీ శబ్దం ఆమెను పట్టించింది. గాయత్రిని అదుపులోకి తీసుకునేందుకు మంగళవారం ఏసీబీ డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు వారి ఇంటికి వెళ్లాయి. తాళం వేసి ఉంది.

Recommended Video

ACB Raids On AP Town
అధికారులు గుళ్లోకి వెళ్లి కూర్చోగా..

అధికారులు గుళ్లోకి వెళ్లి కూర్చోగా..

చుట్టు పక్కల ఉన్నవాళ్లు, ఆ ఇంటి పని మనుషులను ఆరాతీయగా సోమవారం రాత్రే విజయవాడ వెళ్లిపోయారని చెప్పారు. అవాక్కైన ఏసీబీ అధికారులు పక్కనే ఉన్న షిర్డీ సాయిబాబా మందిరాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ కొంతసేపు కూర్చున్నారు. ఈ సమయంలో ఇంటిలోని ఓ గది నుంచి వారికి ఏసీ శబ్దం వినిపించింది.

సెల్ టవర్ పరిశీలించి.. ఆ తర్వాత అరెస్ట్

సెల్ టవర్ పరిశీలించి.. ఆ తర్వాత అరెస్ట్

అప్రమత్తమైన ఏసీబీ అధికారులు గాయత్రి సెల్ టవర్‌ లొకేషన్‌ను తనిఖీ చేశారు. ఆమె ఇంట్లోనే ఉన్నట్లుగా గుర్తించారు. ఆమె ఇంట్లోనే ఉందని నిర్ధరించుకుని నేరుగా ఫోన్‌ చేశారు. ఆస్తి పత్రాలు సోదాలు చేసేందుకు వచ్చామని, అరెస్టు చేసేందుకు కాదని వివరించి తలుపులు తెరిపించారు. ఆమె బయటకు వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం విజయవాడకు తరలించి అరెస్ట్ చేశారు.

వారణాసి వెళ్లేందుకు టిక్కెట్లు

వారణాసి వెళ్లేందుకు టిక్కెట్లు

రఘు, గాయత్రిలు అక్టోబరు 24వ తేదీన విజయవాడ నుంచి వారణాసికి వెళ్లేందుకు బుక్‌ చేసిన విమాన టిక్కెట్లు ఏసీబీ అధికారులకు లభ్యమయ్యాయి. వీటిని గాయత్రి బుక్‌ చేశారు. ఆమె ల్యాప్‌టాప్‌లో నుంచి ఈ టిక్కెట్టును స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు చేయించేందుకు వారణాసి వెళ్లాలనుకున్నామని, అందుకే టిక్కెట్లు బుక్‌ చేశామని ఆమె విచారణలో వెల్లడించారు.

కంపెనీలు తన పేరిటకు..

కంపెనీలు తన పేరిటకు..

సాయిబాబానే నమ్ముకున్నామని, ఇప్పటివరకూ తమకు ఎలాంటి అన్యాయమూ చేయలేదని, తొలిసారి ఎందుకు బాబా ఇలా చేశారో అర్థం కావడం లేదని గాయత్రి వాపోయారు. ఇదిలా ఉండగా గాయత్రి సంస్థల్లో మొదట డైరెక్టర్‌గా వేరే వారు ఉన్నారు. ఆయనకు వ్యాపారంలో నష్టం వచ్చింది. ఆయన ఐపీ పెట్టే అవకాశం ఉందన్న అనుమానంతో అతని పేరిట ఉన్న వ్యాపారాలను గాయత్రి తన పేరిట బదలాయించుకుంది.

5 ఏకరాల నుంచి రూ.500 కోట్లకు

5 ఏకరాల నుంచి రూ.500 కోట్లకు

ప్రభుత్వ అధికారిగా ముప్పై ఏళ్ల పాటు పని చేసి మరో మూడు రోజుల్లో పదవీ విరమణ చేయనున్న రఘు ఏసీబీకి దొరికిపోయాడు. ఇతని స్వస్థలం బంగారుపాళ్యం మండలం మహాసముద్రం. అతనిది అతి సామాన్య కుటుంబం. అయిదెకరాల ఆస్తి ఉండేది. అక్రమాలతో ఇప్పుడు రూ.500 కోట్లు సంపాదించాడు.

English summary
The AP Anti-Corruption Bureau on Monday raided houses of two senior officials in the town planning department and unearthed properties worth Rs 500 crore in market value.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X