Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖలో అవినీతి అనకొండ: ఈరోజు కొనసాగనున్న తనిఖీలు (ఫోటోలు)

అమరావతి: విశాఖలో మరో అవినీతి అధికారి అక్రమాస్తుల గుట్టును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రట్టు చేశారు. నగరంలోని అక్కయ్యపాలెం సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తూ ఆరు నెలల కిందట సస్పెండైన సప్పా రామకృష్ణదాస్ ఇంటితో పాటు అతని బంధువులు, స్నేహితుల ఇళ్లలో మంగళవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏసీబీ అధికారుల కళ్లు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. బుధవారం కూడా సోదాలు కొనసాగించనున్నారు. మంగళవారం సాయంత్రానికి లభ్యమైన ఆస్తుల విలువ రూ. 1.5 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

 ఏసీబీ వలలో అవినీతి అనకొండ

ఏసీబీ వలలో అవినీతి అనకొండ


ఎలమంచిలికి చెందిన సప్పా రామకృష్ణదాస్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో టైపిస్ట్‌గా 1986లో ఉద్యోగంలో చేరాడు. అంచెలంచెలుగా ఎదిగి 2007లో సబ్ రిజిస్ట్రార్ స్థాయికి చేరాడు. మొదట్లో గాజువాక సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఆయన ఆ తర్వాత అక్కయ్యపాలెం సబ్ రిజిస్ట్రార్‌గా బదిలీ అయ్యారు.

ఏసీబీ వలలో అవినీతి అనకొండ

ఏసీబీ వలలో అవినీతి అనకొండ


విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది మార్చిలో సస్పెండ్ అయ్యారు. ఇదిలా ఉండగా రామకృష్ణదాస్ ఉద్యోగంలో ఉండగా చేతివాటం ప్రదర్శించి భారీగా ఆస్తులు సమాకూర్చుకున్నట్టు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది.

 ఏసీబీ వలలో అవినీతి అనకొండ

ఏసీబీ వలలో అవినీతి అనకొండ


దీంతో ఏసీబీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. పథకం ప్రకారం ఏడు బృందాలుగా విడిపోయి రవీంద్రనగర్‌లోని రామకృష్ణదాస్ ఇంటితో పాటు జోడుగుళ్లపాలెంలోని అతని కుమార్తె ఇల్లు, ఏటి కొప్పాకలోని అత్తారిల్లు, స్నేహితులకు చెందిన ఇళ్లలో మంగళవారం తెల్లవారుజామునుంచే సోదాలు ప్రారంభించారు.

ఏసీబీ వలలో అవినీతి అనకొండ

ఏసీబీ వలలో అవినీతి అనకొండ


సోదాల్లో రవీంద్రనగర్‌లో రెండు అంతస్తుల ఇల్లు, జోడుగుళ్లపాలెంలో కూతురి పేరిట ఇల్లు, ఎలమంచిలిలో జీ+2 భవనం, ఏటికొప్పాకలో ఆరు ఎకరాల వ్యవసాయభూమి, దార్లపూడి సమీపంలోని భీమవరంలో కుమార్తె పేరిట 2.32 ఎకరాల వ్యవసాయ భూమి, బావమరిది పేరిట ఒక కారు, రెండు మోటారు సైకిళ్లు, నగరంలోని మూడు బ్యాంకుల్లో లాకర్లు ఉన్నట్టు గుర్తించారు.

 ఏసీబీ వలలో అవినీతి అనకొండ

ఏసీబీ వలలో అవినీతి అనకొండ

రవీంద్రనగర్‌లోని కెనరా బ్యాంకు లాకర్‌ను సాయంత్రం తెరవగా అందులో రూ. 14 లక్షలు నగదు, 627 గ్రాముల బంగారం, మూడు లక్షల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్ బాండ్లు, ఏటికొప్పాకలో చిట్‌లకు సంబంధించిన వివరాలు లభ్యమయ్యాయి.

 ఏసీబీ వలలో అవినీతి అనకొండ

ఏసీబీ వలలో అవినీతి అనకొండ


బ్యాంకు పనివేశలు ముగియడంతో ద్వారకా నగర్‌లోని ఏస్‌బీఐ లాకర్, అరిలోవలోని ఆంధ్రాబ్యాంకు లాకర్‌ను తెరిచేందుకు అవకాశం లేకుండా పోయింది. మంగళవారం సాయంత్రం వరకూ తాము గుర్తించిన విలువ డాక్యుమెంట్ విలువ ప్రకారం రూ. 1.5 కోట్లు ఉంటుందన్నారు.

 ఏసీబీ వలలో అవినీతి అనకొండ

ఏసీబీ వలలో అవినీతి అనకొండ


సబ్ రిజిస్ట్రార్‌ కావడంతో అండర్ వాల్యూతో రిజస్ట్రేషన్ చేయించుకున్నాడని తెలిపారు. తాము గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ డాక్యుమెంట్ విలువ కంటే మూడింతలు ఉంటుందని డీఎస్పీ రామకృష్ణప్రసాద్ తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టినట్టు ప్రాథమిక ఆధారాలు లభించడంతో అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+