అక్రమాస్తులు: జాయింట్ కలెక్టర్ల నివాసాలపై ఏసీబీ దాడులు
విజయనగరం: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కాకర్ల నాగేశ్వరరావు ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తోన్నారు. బుధవారం ఉదయం 5.30గంటల నుంచి ఈ సోదాలు నిర్వహిస్తుండటం గమనార్హం.
రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రాంతాలలో ఏకకాలంలోసోదాలు నిర్వహిస్తున్నారు. బెంగుళూరు, విశాఖపట్నంలోని 6 ప్రాంతాల్లో, అనకాపల్లి, విజయనగరం జిల్లాలోని 3 ప్రాంతాల్లో, పశ్చిమ గోదావరి జిల్లా పోతవరం మండలం త్యాజంపూడి గ్రామంలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

ఏసీబీ అధికారుల సోదాల అనంతరం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కుతున్న అధికారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది.












Click it and Unblock the Notifications