ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి, పిడుగుపాటుకు ఆరుగురు
తూర్పుగోదావరి: జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సామర్లకోట మండలం తిమ్మాపురం ఏబీడీ రోడ్డు వద్ద ఓ లారీ అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు దుర్మరణం చెందారు.
తీవ్రంగా గాయపడిన మరో ఇద్దర్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లారీ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

పిడుగుపాటుకు ఆరుగురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో శనివారం పిడుగుల వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులు పడి ఆరుగురు మృత్యువాత పడ్డారు. నెల్లూరు జిల్లా సంగం మండలం జంగాలకండ్రిగలో మత్స్యకారుడు సుబ్రహ్మణ్యం చేపలవేటకు వెళ్లి పిడుగుపాటుతో చనిపోయాడు. ఏఎస్‌పేట మండలం అబ్బాషాహేబ్ పేటలో పొలాల్లో గడ్డి కోస్తుండగా పిడుగు పడి బాలయ్య అనే మరో వ్యక్తి మరణించాడు.
శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం భగీరథ పురంలో 35 ఏళ్ల రాజు, వరంగర మండలంలోని సంగాంలో గణేశ్ అనే యువకుడు పిడుగు పాటుకు బలయ్యాడు. విజయనగరం జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో మరొకరు పిడుగుపాటుతో మృత్యువాతపడ్డారు. కాగా, భారీ వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.












Click it and Unblock the Notifications