మద్యంమత్తులో బీటెక్ విద్యార్థులు: కారు-ఆటో ఢీ, ముగ్గురు మహిళల మృతి

Subscribe to Oneindia Telugu

కృష్ణా: జిల్లాలోని మైలవరంలో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు.. ఆటోను ఢీకొట్టడంతో ఆటోలోని నలుగురు మృతి చెందారు. మృతుల్లో డ్రైవర్ తోపాటు ముగ్గురు మహిళలు ఉన్నారు. మహిళలందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు.

ఈ ప్రమాదంలో ఆటోలోని ఇద్దరు చిన్న పిల్లలతోపాటు మరో ఆగురురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రార్థనకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న బీటెక్ విద్యార్థులు కారును వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Accident in Mylavaram: four killed

మృతుల్లో లత(40), నాగమణి(33), మేరీ(17), డ్రైవర్ నాగేశ్వర్ రావు ఉన్నారు. కాగా, ఘటనకు కారణమైన బీటెక్ విద్యార్థులు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఖమ్మం జిల్లా పాల్వంచలోని ఓ కాలేజీలో విద్యార్థులు బీటెక్ చదువుతున్నట్లు తెలిసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Four killed in a road accident occurred in Mylavaram in Krishna district on Saturday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి