మంత్రి యనమల కుటుంబంలో విషాదం
మంత్రి యనమల రామకృష్ణుడు కుటుంబంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తొండంగి మండలం ఆవులమంద గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యనమల కృష్ణుడు సోదరుడు, పీబీసీ ఛానల్ మాజీ చైర్మన్ యనమల రామారావు కుమారుడు వెంకటరమణ
తూర్పు గోదావరి: మంత్రి యనమల రామకృష్ణుడు కుటుంబంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తొండంగి మండలం ఆవులమంద గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యనమల కృష్ణుడు సోదరుడు, పీబీసీ ఛానల్ మాజీ చైర్మన్ యనమల రామారావు కుమారుడు వెంకటరమణ మృతి చెందాడు.
రెండ్రోజుల క్రితం వెంకటరమణ తన స్వగ్రామం ఏవీ నగరం నుంచి కాకినాడకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆవులమంద గ్రామం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మరో ద్విచక్ర వాహనంను ఢీకొట్టడంతో రమణ గాయపడ్డారు. దీంతో వైద్యం నిమిత్తం కాకినాడ ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని బుధవారం ఏవీ నగరం తీసుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న మంత్రి యనమల రామకృష్ణుడు ఏవీ నగరం చేరుకుని.. ఆయన సోదరుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.












Click it and Unblock the Notifications