TTD: శ్రీవారి దర్శనం, వసతి పై తాజా నిర్ణయం- పేర్లు మార్పు..!!
Tirumala: తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సామాన్య భక్తులకు దర్శనం మరింత సులభంగా జరిగేలా మార్పులు తెస్తోంది. వసతి విషయంలోనూ తాజా గా కసరత్తు చేస్తోంది. భక్తులకు అన్నప్రసాదంలో కొత్తగా మరో పదార్ధం చేర్చాలని నిర్ణయం తీసుకు న్నారు. ఇక.. తిరుమలలో ఉన్న వ్యక్తుల పేర్లతో ఉన్నఅతిధి గృహాలకు ఆధ్యాత్మిక.. ధార్మిక పేర్లు గా మార్పు మొదలు పెట్టారు.
టీటీడీ నిర్ణయాలు
ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం.. వసతి టోకెన్లను నేడు టీటీడీ విడుదల చేయనుంది. ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల ఏప్రిల్ నెల కోటాను విడుదల చేసారు. అదే విధంగా ఏప్రిల్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటా తో పాటుగా శ్రీవాణి ట్రస్టు టికెట్లు జారీ ప్రక్రియ పూర్తయింది. ఇక, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను అధికారులు విడుదల చేసారు.

దర్శనం - వసతి
కాగా, ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ రోజు (జనవరి 24)న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇదే సమయంలో తిరుమల, తిరుపతిలో ఏప్రిల్ నెల గదుల కోటాను జనవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో దాతల సహకారంతో నిర్మించిన గెస్టు హౌస్ లకు ఆధ్యాత్మిక..ధార్మిక పేర్లు పెట్టాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు.
ఆధ్యాత్మిక పేర్లు
బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు పేర మార్పు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ముందుగ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి - ప్రశాంతి దంపతుల విరాళంతో నిర్మించిన వీపీఆర్ భవనం పేరును లక్ష్మీ భవన్ గా మార్పు చేసారు. ఇదే విధంగా 45 భవనాల పేరు మార్పు పైన దాతలు అంగీకరించారు. ఇక, తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన పైన ప్రభుత్వం న్యాయ విచారణ కోసం హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించింది. ఈ వారంలోనే విచారణ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల్లోకా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది.












Click it and Unblock the Notifications