మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం: నిందితుడి అరెస్టు

Accused arrested
హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలో ఓ మైనర్ బాలికను అపహరించి, ఆమెపై అత్యాచారం చేసిన నిందితుడు సులేమాన్ బిన్ హుస్సేన్‌ను అరెస్టు చేశారు. శాలింబడం పోలీసు ఇన్‌స్పెక్టర్ మహేశ్వర్ బుధవారం ఈ విషయం చెప్పారు. కిడ్నాప్, అత్యాచారం, తదితర కేసులను అతనిపై పెట్టినట్లు తెలిపారు. ఆ తర్వాత అతన్ని జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

పోలీసుల కథనం ప్రకారం - ఈ నెల 15వ తేదీన మైనర్ బాలిక కిడ్నాప్ జరిగింది. ఆమెను కిడ్నాప్ చేసిన సులేమాన్ పాతబస్తీలోని ఓ లాడ్జీలో ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత కర్ణాటకలోని గుల్బర్గాకు తరలించాలని భావించాడు.

ఈలోగా బాలిక అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. పలువురిని విచారించగా ఆ బాలికను ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా చూశామని చెప్పారు.

బాలిక కోసం పోలీసులు ముమ్మరంగా గాలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో నిందితుడు సులేమాన్‌పై అనుమానంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పోలీసులు బాలిక తండ్రి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+