పెళ్లికి నిరాకరించిందని తల్లీకూతుళ్లపై యాసిడ్ దాడి
విజయవాడ: కృష్ణా జిల్లాలోని రాజుపేటలో ఓ ప్రేమోన్మాది దారుణ సంఘటకు పాల్పడ్డాడు. తల్లీకూతుళ్లపై సుభానీ అనే వ్యక్తి యాసిడ్‌తో డాది చేశాడు. పెళ్లికి నిరాకరించిన యువతిపై, ఆమె తల్లిపై అతను ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు. గత కొంత కాలంగా సుభానీ పెల్లి పేరుతో తన కూతురిని వేధిస్తున్నట్లు అమ్మాయి తల్లి చెప్పింది.

విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఇదిలావుంటే, కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో రంగస్వామి అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. సెమిస్టర్‌లో ఫెయిల్ చేశారని మనస్తాపానికి గురైన రంగస్వామి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తోటి విద్యార్థులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరు గల్లంతు
కాగా, నల్లగొండ జిల్లా పిఎ పల్లి మండలం అక్కంపల్లి రిజర్వాయర్‌లో ఇద్దరు గల్లంతయ్యారు. బట్టలు ఉతికేందుకు వెళ్లిన మహిళ, ఆమె కుమారునడు గల్లంతయ్యారు.












Click it and Unblock the Notifications