శ్రీకాకుళం గ్రామాల్లో నాగ చైతన్య- జాలర్ల రియల్ లైఫ్‌తో మూవీ
శ్రీకాకుళం: అక్కినేని నాగ చైతన్య తన తదుపరి సినిమా కోసం సన్నద్ధమౌతోన్నాడు. శ్రీకాకళం జిల్లా మత్స్యకార గ్రామాలు, వారి జీవితాల్లో సంభవించిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను సెట్స్ పైకి రాబోతోంది. చందు మొండేటి దర్శకుడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకొంటోందీ మూవీ.
నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. కానిస్టేబుల్ శివ రోల్‌లో మెరిశాడు చైతు. యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ మూవీ ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే మెప్పించిందనేది టాక్.

ఈ నేపథ్యంలో- తన కొత్త సినిమాపై కసరత్తు చేస్తోన్నాడు నాగచైతన్య. ఇందులో భాగంగా మత్స్యకార గ్రామాల్లో కలియ తిరిగాడు. వారి స్వీయ అనుభవాలను పంచుకున్నాడు. ఆయన వెంట దర్శకుడు చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు ఉన్నారు. చేపల వేటకు వెళ్లి.. భారత సముద్ర జలాలను దాటుకుని పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన మత్స్యకారుడిగా ఈ సినిమాలో కనిపించబోతోన్నాడు.
పాన్ ఇండియా మూవీగా షూటింగ్ జరుపుకోనుంది మూవీ. గీతా ఆర్ట్స్ బ్యానర్ కింద అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. 2018లో గుజరాత్ విరావల్ నుంచి చేపల వేటకు వెళ్లిన 21 మంది మత్స్యకారులు పొరపాటున భారత సముద్ర జలాలను దాటుకుని పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

వారిని పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ బంధించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సంప్రదింపులు ఫలించడంతో వారందరినీ పాకిస్తాన్ విడిచిపెట్టింది. వారి కథను ఆధారంగా తీసుకునే నాగ చైతన్య తన నెక్స్ట్ మూవీలో నటించబోతోన్నాడు. పాక్ కోస్ట్ గార్డ్స్ చేతికి చిక్కిన మత్స్యకారుల్లో ఒకరైన మత్స్యలేశం గ్రామానికి చెందిన గణగల్ల రామరావును కలిశాడు ఆయన అనుభవాలను తెలుసుకున్నాడు.
ఈ సినిమాలో నాగ చైతన్య గణగల్ల రామరావు క్యారెక్టర్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. వారితో కలిసి సముద్రంపై చేపలవేటకు సైతం వెళ్లనున్నాడు. వారి దినచర్యను అణువణువు పరీశీలించనున్నాడు. సినిమాను సహజంగా చిత్రీకరించాలనే ఉద్దేశంతో మత్స్యకారులతో కలిసి కొన్ని రోజుల పాటు నాగ చైతన్య, దర్శకుడు చందు మొండేటి మత్స్యాకర గ్రామాల్లోనే కలియ తిరుగుతారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications