సలహాదారు పదవిపై అలీ భావోద్వేగం- కూతురు పెళ్లికి గిఫ్ట్ -షుక్రియా జగనన్న

ఏపీలో వైసీపీకి మద్దతుదారుగా ఉంటూ, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్దానిక సంస్ధల ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేసిన టాలీవుడ్ నటుడు అలీని సీఎం జగన్ తాజాగా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిలో నియమించారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో ఉండేలా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జీత భత్యాల్ని మాత్రం ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నటుడు అలీ తన నియామకంపై స్పందించారు.

వైసీపీ కండువా కప్పిన తొలి రోజు నుంచి తాను పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేశానని ఆయన గుర్తించారని అలీ తెలిపారు. ఏమీ ఆశించకుండా పార్టీలో వచ్చి వైసీపీ కోసం పనిచేశానని, రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసినట్లు జగన్ గుర్తించారన్నారు. తనకు ఏ పదవి ఇస్తారనే దానిపై భిన్న స్పందనలు వచ్చినా తనకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించడంపై సీఎం జగన్ కు అలీ ధన్యవాదాలు తెలిపారు. ఇది తన కుమార్తె పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్ గా భావిస్తున్నట్లు అలీ తెలిపారు.

actor ali emotionally reacted on advisor post-says jagananna gift on daughters marriage

అలీతో పాటు ఆయన సతీమణి జుబేదా కూడా సలహాదారు నియామకంపై స్పందించారు. ఈ రోజు చాలా హ్యాపీగా ఉందని, ఓ పండగలా ఉందని తెలిపారు. అలీకి ఏ పదవి ఇస్తారనే దానిపై బంధువులు, స్నేహితులు అడుగుతుంటే తాము ఏం చెప్పాలా అని టెన్షన్ టెన్షన్ గా ఉన్నామని, ఈ టెన్షన్ కు ఇవాళ బ్రేక్ పడిందన్నారు. ఇదంతా జగన్ భాయ్ వల్లే జరిగిందని, షుక్రియా జగన్ భాయ్ అని జుబేదా సంతోషంగా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+