తెలుగు సినీ నటుడు పొట్టి సత్యం కాలధర్మం

Actor Potti Satyam dead
ఏలూరు: తెలుగు చలనచిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన పొట్టి సత్యం ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయస్సు 85 ఏళ్లు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు

ఆయన కొయ్యలగూడెంలోని వైయస్సార్ నగర్‌లోని తమ బంధువులు శెనగశెట్టి లక్ష్మీనారాయణ, శెనగశెట్ిట వెంకటేశ్వర రావు వద్ద ఉంటూ వచ్చారు. చెన్నై టీనగర్‌లో సత్యానికి తనవారెవరూ లేరు. దీంతో నెల క్రితం తమకు వరుసకు సోదరులైన తమ ఇంటికి వచ్చినట్లు లక్ష్మినారాయణ చెప్పారు.

గరవరంలోని తమ పొలంలో ఉన్న ఇంటి వద్ద సత్యానికి చికిత్స చేయిస్తూ వచ్చామని, ఆరోగ్యం విషమించి ఆయన మరణించారని ఆయన చెప్పారు. పొట్టి సత్యం 150కి పైగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారని చెప్పారు.

ప్రముఖ నటుడు మోహన్‌బాబుతో ఉన్న పరిచయంతో ఆయన అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు, చిల్లరకొట్టు చిట్టె్మ తదితర చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించారు. పొట్టి సత్యం స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+