పవన్ పై ఆగని ప్రకాష్ రాజ్ ట్వీట్ వార్..మనకేం కావాలని ప్రశ్న..!
ఏపీలో తిరుమల లడ్డూ వ్యవహారం తెరపైకి వచ్చాక మొదట్లో అంతగా స్పందించని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మాత్రం సీఎం చంద్రబాబును మించి దూకుడుగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షకుడిగా తనను తాను అభివర్ణించుకుంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఉత్తరాదిలో సైతం చర్చ జరుగుతోంది. అయితే పవన్ వ్యాఖ్యలకు ఎంత మద్దతు లభిస్తోందో అంతే వ్యతిరేకత కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ ను ట్వీట్లతో టార్గెట్ చేస్తున్న నటుడు ప్రకాష్ రాజ్ తన వార్ కొనసాగిస్తున్నారు.

మనకేం కావాలి...
— Prakash Raj (@prakashraaj) September 27, 2024
ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా..?
లేక ప్రజల మనోభావాలు
గాయపడకుండా..పరిపాలనా సంబంధమైన..అవసరమైతే తీవ్రమైన చర్యలతో.. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..?
జస్ట్ ఆస్కింగ్ #justasking
తిరుమల లడ్డూ వివాదంపై పవన్ చేసిన కామెంట్స్ ను టార్గెట్ చేస్తూ రెండు రోజులుగా వరుసగా ట్వీట్లు పెడుతున్న ప్రకాష్ రాజ్.. ఇవాళ మరో ట్వీట్ చేశారు. ఇందులో మనకేం కావాలి...అంటూ ప్రశ్నించారు. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా..?, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా..పరిపాలనా సంబంధమైన ..అవసరమైతే తీవ్రమైన చర్యలతో.. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..? జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.
తద్వారా బాధ్యతాయుత డిప్యూటీ సీఎం స్ధానంలో ఉన్న పవన్ కళ్యాణ్ లడ్డూ వివాదంలో తన వ్యాఖ్యలతో ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని ప్రకాష్ రాజ్ చెప్పకనే చెప్పారు. దీని ద్వారా రాజకీయ లబ్ది సాధించాలని భావిస్తున్నారా లేక సున్నిత సమస్యను పరిష్కరించాలనుకుంటున్నారా అని సూటిగానే పవన్ ను ప్రశ్నించారు. దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications