జగన్ ఓడిపోతాడని నాలుగేళ్ల కిందటే హెచ్చరించిన హీరో రామ్

Ram Pothineni: రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు, నాయకులపై దాడులు మొదలయ్యాయి. మాజీ మంత్రులను సైతం వదలట్లేదు టీడీపీ శ్రేణులు.

మొన్నటి ఎన్నికల్లో అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీకి దక్కింది.. 11 స్థానాలే. కంచుకోటల్లాంటి నియోజకవర్గాలను వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. విశాఖపట్నం- 2, చిత్తూరు-2, కర్నూలు- 2, ప్రకాశం- 2, కడప- 3.. ఇవీ ఆ పార్టీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాల సంఖ్య.

Actor Ram Pothineni old tweet on YS Jagan surfaced on social media

ఈ పరిస్థితుల మధ్య హీరో రామ్ పోతినేని తెర మీదికి వచ్చాడు. గతంలో ఆయన పోస్ట్ చేసిన ఓ ట్వీట్.. ఇప్పుడు వైరల్‌గా మారింది సోషల్ మీడియాలో. వైఎస్ఆర్సీపీ ఓటమిని ఆయన ముందుగానే పసిగట్టినట్టనిపించింది ఈ ట్వీట్ చూస్తే. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన ఏడాదిన్నరకే ఆయనను హెచ్చరించారు.. హీరో రామ్.

పెద్ద కుట్ర జ‌రుగుతున్న‌ట్టుంది!! సీఎంని త‌ప్పుగా చూపించ‌డానికి! @ysjagan garu. మీ కింద ప‌ని‌ చేసే కొంత‌మంది మీకు తెలియ‌కుండా చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల మీ రెప్యుటేష‌న్‌కి, మీ మీద మేం పెట్టుకున్న న‌మ్మ‌కానికి డ్యామేజ్ కలుగుతోంది. వాళ్ల మీద ఓ లుక్కేస్తార‌ని ఆశిస్తున్నాం.. అంటూ 2020 ఆగస్టు 15వ తేదీన రామ్ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. అది ఇప్పుడు వైరల్ అయింది.

ఇదే అనుమానాన్ని వైఎస్ఆర్సీపీకి చెందిన కొందరు ఓడిపోయిన ఎమ్మెల్యేలు సైతం వ్యక్తం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజానగరం, ధర్మవరం, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, కొట్టు సత్యనారాయణ సహా కొందరు సీనియర్లు, సోషల్ మీడియా ప్రతినిధులు బాహటంగా జగన్ సలహాదారులను తప్పుపట్టిన విషయం తెలిసిందే.

జగన్ వద్ద పని చేసిన ఐఎఎస్ అధికారి ధనంజయ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డితో పాటు రాజకీయ వ్యూహకర్తగా పని చేసిన ఐప్యాక్ టీమ్‌ను కూడా వారు తప్పుపట్టారు. జగన్‌ను కలుసుకోవాలంటే గంటల కొద్దీ పడిగాపులు పడాల్సి వచ్చేదని, ఆయన చుట్టూ ఉన్న కోటరీనే దీనికి కారణమంటూ మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+