సోషల్ మీడియాలో మోడీని తిట్టండి: బాబుకు నటుడు శివాజీ మెచ్చుకోలు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి తిరుపతిలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఆ హామీని తుంగలో తొక్కారని, ఆయన పైన సోషల్ మీడియాలో విరుచుకు పడాలని నటుడు శివాజీ సోమవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు.

ఆయన న్యూజెర్సీలో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారని, అలాంటి వ్యక్తికి కేంద్రం సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.

Also Read: ఏం మీకు బాధ్యత లేదా, 2గం.లు ఆలోచించు, చూసుకుంటాం!: మోడీకి బాబు

బీజేపీ ఏపీకి పూర్తి అన్యాయం చేయ్యాలని భావిస్తోందని మండిపడ్డారు. ఏపీకి చెందిన విద్యావంతులంతా సోషల్ మీడియా ద్వారా ప్రధాని మోడీ పైన యుద్ధం ప్రకటించాలన్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇలా ఏదయినా సరే ప్రధానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలన్నారు.

Actor Sivaji says youth should target PM Modi

ఆయన వినియోగించుకునే సోషల్ మీడియానే ఆయన పైన నిరసన దాడికి ఉపయోగించాలన్నారు. అప్పుడైనా ప్రజల ఆకాంక్ష తెలిసి వస్తుందేమో అన్నారు. మనకు మోడీని తిట్టాలని లేనప్పటికీ ఆయనే తిట్టించుకుంటున్నారన్నారు.

హోదా, రాయితలను అమలు చేయాలి: వైసిపి

ఏుపీకి ప్రత్యేక హోదా, రాయితీలను వెంటనే అమలుచేయాలని వైసిపి ఎంపీలు సోమవారం డిమాండ్ చేశారు. విభజన సమయంలో అనేక హామీలు ఇచ్చారని, ఇప్పుడు వాటిని కచ్చితంగా అమలు చేయాలన్నారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actor Sivaji said on Monday that AP youth should target PM Modi over Special Status issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X