సారీ ..వైసీపీ దెబ్బకు దిగొచ్చిన విశ్వక్ సేన్..కొంపముంచిన జనసేన
ఇటీవల కాలంలో సినిమా ఫంక్షన్స్‌లో రాజకీయా ప్రసంగాలు ఎక్కువైయ్యాయనే చెప్పాలి.ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీని టార్గెట్ చేసుకుని పలువురు విమర్శలు గుప్పించారు. రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌ను విమర్శించారు. దీంతో 'గేమ్ ఛేంజర్' సినిమాకు నెగిటివ్‌గా వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
Cheptuna All #YSRCPSM Family Members Ki Feb 14th Roju ,
— JAGUN 💥 (@jaganfanpage) February 9, 2025
Am Panulu PetuKokandi, #BoycottLaila Antheyyy 💯... pic.twitter.com/TzruAlEjO0
దీంతో బాక్సాఫీస్ వద్ద 'గేమ్ ఛేంజర్' ఫ్లాప్‌గా నిలిచింది. సాయి ధరమ్ తేజ్ నటించిన 'రిపబ్లిక్' సినిమా వేదికపై నుంచి కూడా పవన్ కల్యాణ్ అప్పటి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సినిమాపై కూడా వైసీపీ శ్రేణులు గట్టిగానే ఫైట్ చేశాయి.తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన 'లైలా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సమయంలో చిరంజీవి జై జనసేన అంటూ అక్కడకు వచ్చిన అభిమానుల్లో ఉత్సాహం నింపారు. అయితే నటుడు పృథ్వి సినిమా హద్దులు దాటి మాట్లాడారు.పృథ్వి చేసిన కామెంట్స్ ఇప్పుడు 'లైలా' సినిమాను ఇరకాటంలోకి నెట్టింది.పృథ్వి గతంలో వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. దీంతో 'లైలా' సినిమా ఈవెంట్‌లో వైసీపీని చులకనగా చేసి మాట్లాడారు.

పృథ్వి మాట్లాడుతూ..ఇందులో నేను మేకల సత్తిగా చేశానని తెలిపారు. అయితే మేకలు ఎన్ని ఉన్నాయని షాట్ మధ్యలో అడిగితే 150 ఉన్నాయని తెలిపాను. షాకింగ్ ఎంటో కానీ సినిమా చివరిలో లెక్కేస్తే మొత్తం 11 గొర్రెలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఇదేంటో అర్థం కాలేదని, అన్నీ సినిమాలో బ్రహ్మాండంగా పెట్టారంటూ కామెంట్లు చేశారు. వైసీపీని విమర్శించడంతో ఆ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా పృథ్వితో పాటు,'లైలా' సినిమాను కూడా టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ట్విట్టర్‌లో 25 వేలకు పైగా 'లైలా' సినిమాకు వ్యతిరేకంగా ట్వీట్లు వెలిశాయి. బాయ్‌కాట్ 'లైలా' అంటూ నేషనల్ లేవల్లో వైసీపీ శ్రేణులు సినిమాకు వ్యతిరేకంగా ట్రెండ్ చేశారు.క్షమాపణలు చెప్పకపోతే , సినిమాను బ్యాన్ చేస్తామని వైసీపీ శ్రేణులు హెచ్చరించాయి. దీంతో దిగొచ్చిన చిత్ర యూనిట్..క్షమాపణలు చెప్పడం జరిగింది.
లక్ష ట్వీట్స్ అయినా వేస్తాం @VishwakSenActor గారు.
— Shaik Mohammed Afzal (@AfzalShaik_Offl) February 10, 2025
ప్రతి ఒక్కడికి ఇది ఫ్యాషన్ అయిపొయింది.
అతను మాట్లాడింది తప్పు..
కావాలంటే అతనిని సినిమాలు వదిలేసి రాజకీయాలు చేసుకోమనండి అభ్యంతరం లేదు.
సినిమా ని సినిమాగానే ఉంచండి. #BoycottLaila pic.twitter.com/xO5Xwg1CLZ
హీరో విశ్వక్ సేన్‌తో పాటు దర్శకుడు మీడియా సమావేశం నిర్వహించి జరిగిన ఘటనకు క్షమాపణలు చెప్పారు.పృథ్వి మాట్లాడిన దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని, ఆయన ఏం మాట్లాడతారో మాకు తెలియదని, ఆయన మాట్లాడే సమయంలో తాము చిరంజీవిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లామని, ఆయన అలా మాట్లాడకుండా ఉండాల్సిందని, అయినప్పటికీ మా సినిమా స్టేజ్ మీద జరిగింది కాబట్టి తాము క్షమాపణలు చెబుతున్నామని విశ్వక్ సేన్ తెలిపారు.పృథ్వి చేసిన దానికి తమ సినిమాను బ్యాన్ చేయాలనడం సరైంది కాదంటూ విశ్వక్ సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. నా సినిమాకు మీ అందరి సపోర్టు కావాలని విశ్వక్ సేన్ కోరారు. విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పడంపై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.
మా వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు 🔥
— RAJIV (@KingRajiv) February 9, 2025
మర్యాదగా వాడితో క్షమాపణ చెప్పిస్తే సరి...
లేకపోతే నీ లైఫ్ లో చూడని నెగెటివిటీ ఈ సినిమాకి చూస్తావ్ @VishwakSenActor #BoycottLaila pic.twitter.com/wrCjIDazhD
Jagan ane okkadiki ee lakshala sainyam undhi so meeru mee limits lo brathakandi 💥#YSRCPSM #BoycottLaila pic.twitter.com/h2g3vxzpkn
— ANIMAL (@animaluuuuu) February 10, 2025












Click it and Unblock the Notifications