వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు 'కమలం' ఝలక్: టిడిపికి రాజీనామా, బిజెపిలోకి నటి కవిత?

ప్రముఖ నటి, తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కవిత బిజెపిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం మహానాడులో తనకు అవమానం జరిగిందని ఆమె కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రముఖ నటి, తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కవిత బిజెపిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం మహానాడులో తనకు అవమానం జరిగిందని ఆమె కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే.

తెలుగుదేశం పార్టీలో అవమానం: చంద్రబాబుకు నటి కవిత గట్టి షాక్!తెలుగుదేశం పార్టీలో అవమానం: చంద్రబాబుకు నటి కవిత గట్టి షాక్!

ఈ నేపథ్యంలో టిడిపికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సినిమాలు వదులుకుని, పార్టీకి పనిచేసిన తనను అధికారంలోకి వచ్చాక పక్కకుపెట్టి అవమానిస్తున్నారని, కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సినిమా నటులంటే పడదు

సినిమా నటులంటే పడదు

తాజా మహానాడుకు వచ్చిన ఆమెను వేదిక ఎక్కనీయకుండా నిర్వహకులు అడ్డుకోవడంతో ఆవేదన చెందిన కవిత పార్టీకి సినిమా నటులంటే పడదని, ప్రతిపక్షంలో ఉండగా వేదిక ఎక్కించారని , అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పనికిరాకుండా పోయానో పార్టీనే చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎంతో నష్టపోయా

ఎంతో నష్టపోయా

పార్టీకి పని చేసి ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా నష్టపోయిన తనను ఇప్పుడు మానసికంగా కూడా అవమానించారని, అన్నింటికీ దేవుడున్నాడని ఆమె కన్నీళ్లపర్యంతరమయ్యారు.

బిజెపిలో చేరనున్నారా?

బిజెపిలో చేరనున్నారా?

మహానాడు వేదికపై అవమానం నేపథ్యంలో ఆమె టిడిపికి రాజీనామా చేసి, బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఓ బిజెపి ఢిల్లీస్థాయి నేత ఆమెను కలిశారని, పార్టీ మారే విషయమై మాట్లాడారని ప్రచారం జరుగుతోంది.

మూడు రాష్ట్రాల్లోను..

మూడు రాష్ట్రాల్లోను..

ఆయన కంటే ముందే ఏపికి చెందిన మరో రాష్ట్ర బిజెపి నేత చర్చించి పార్టీలో చేరాలని కోరినట్లుగా తెలుస్తోంది. మూడు భాషలు తెలిసిన ఆమెను.. తమిళనాడు, కర్నాటక, కేరళలో పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని కోరగా.. ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని వారికి కవిత చెప్పారని అంటున్నారు.

కవిత ఎటు వెళ్తారు?

కవిత ఎటు వెళ్తారు?

తాజాగా, మహానాడులో అవమాన పరిణామాల నేపథ్యంలో కవిత బిజెపిలో చేరేందుకే నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఆమె తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. కేసీఆర్‌ను పొగిడారు. ఈ నేపథ్యంలో ఆమె ఏం చేస్తారనేది ఆసక్తికరమే.

English summary
It is said that Actress Kavitha may join Bharatiya Janata Party soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X