బండారు పై బీజేపీ మహిళా నేత సీరియస్, అల్టిమేటం..!!
తెలుగుదేశం నేత సత్యనారాయణ మూర్తిపై సినీ నటి, బీజేపీ నేత కుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మంత్రి రోజాపై బండారు సత్యానారాయణ చేసిన చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఖుష్బూ సీరియస్ అయ్యారు. బండారు సత్యనారాయణ రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బండారు ఓ రాజకీయ నాయకుడి గానే కాదు మనిషిగా కూడా విఫలమయ్యారు అంటూ మండిపడ్డారు. ఒక మనిషిగా కూడా ఆయన విఫలమయ్యారని సీరియస్ అయ్యారు.
మంత్రి రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలు దారుమని ఖష్బూ మండిపడ్డారు. తాను రోజాకు ఓ స్నేహితురాలిగా కాదు సాటి మహిళగా మద్దతునిస్తున్నానని బండారు క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. మహిళలను దూషించడం బండారు తన జన్మ హక్కు అనుకుంటున్నారా అని నిలదీసారు. ఓ మహిళ మంత్రిపై బండారు వ్యాఖ్యలు భద్రతకు, దిగజారుడు తనానికి నిదర్శనంగా పేర్కొన్నారు. మహిళలను గౌరవించేవారు ఎవరూ బండారులా మాట్లాడరని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో మంత్రి రోజాకు తన మద్దతు ఉంటుందని చెప్పారు. బండారు తక్షణమే రోజాకి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఖుష్బూ డిమాండ్ చేసారు.

బండారు క్షమాపణలు చెప్పే దాకా సాగే పోరాటంలో తాను కలుస్తానని వెల్లడించారు. నారీ శక్తి వంటి చట్టాలను తెచ్చుకుంటున్నాం..అయినా ఇంకా మహిళలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయటం చాలా దారుణమని నీచాతి నీచంగా మాట్లాడటం వారి మానసిక దౌర్భల్యానికి నిదర్శనం అంటూ ఖుష్బూ తీవ్రంగా మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ చట్టాలు మహిళల సాధికారత ఉపయోగపడతాయి.
Actor-politician @khushsundar in support of actor-politician @RojaSelvamaniRK @ndtv @ndtvindia pic.twitter.com/k3yCc44yZY
— Uma Sudhir (@umasudhir) October 6, 2023
కానీ ఇటువంటి సమయంలో కూడా మహిళల గురించి కుసంస్కారం..మానసిక దుర్భలత్వంతో మాట్లాడటం మహిళల గురించి నీచంగా మాట్లాడటం తమ జన్మ హక్కు అనుకుంటున్నారు బండారు సత్యనారాయణమూర్తి వంటి వ్యక్తులు అంటూ ఖుష్బూ నిప్పులు చెరిగారు.బంగారు సత్యానారాయణ రోజాకు క్షమాపణలు చెప్పే వరకు తాను పోరాడతానని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications