30న 10కె రన్: సందడి చేసిన నటి శ్రియ(పిక్చర్స్)
హైదరాబాద్: ‘హైదరాబాద్ 10కె రన్' నవంబర్ 30న జరుగనుంది. ప్రతీ ఏడాది మాదిరిగానే ‘రిలయన్స్ జియో హైదరాబాద్ 10కె రన్' పేరిట హుస్సేన్‌సాగర్ తీరంలో నిర్వహించనున్నారు. ఈసారి ప్రచారకర్తగా దిగ్గజ స్ప్రింటర్ మిల్కాసింగ్ వ్యవహరించడం విశేషమని 10కె రన్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.
గురువారం సోమాజిగూడలోని పార్క్ హోటల్‌లో మీడియా సమావేశంలో పరుగు విశేషాలను ఛైర్ పర్సన్ చిగురుపాటి ఉమ వెల్లడించారు. పీపుల్స్ ప్లాజా వద్ద ఈ 10కె రన్ తోపాటు 7కె మజా రన్ కూడా ప్రారంభమవుతుందని చెప్పారు. 10కె రన్‌కు తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని రాష్ట్ర పారిశ్రామిక మౌళిక వసతుల సంస్థ ఎండి జయేష్ రంజన్ అన్నారు. జయేష్ రంజన్ పేరు నమోదుతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సినీ నటి శ్రియ పాల్గొని మాట్లాడారు. ‘10కె రన్ అనేది ఓ ఫన్ యాక్టివిటీ. నగరం మొత్తాన్ని కలిపే కార్యక్రమం అది. మీ నగరం గురించి మీరు మరింతగా తెలుసుకునే అవకాశం కల్పించడంతోపాటుగా ఫిట్‌నెస్ పట్ల మరింత అవగాహన కల్పిస్తుంది. మీరు పరుగుపెట్టకపోయిన మీ బంధువులు, స్నేహితులను ఎంకరేజ్ చేయడానికైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి' అని శ్రియ చెప్పారు.
తాను రోజూ పరుగెడుతానని చెప్పిన శ్రియ, 5కె రన్, 10కె రన్ ఈవెంట్స్‌లో పాల్గొని పరుగు పెట్టింది లేదన్నారు. అయితే గతంలో 10కె రన్ ప్రెస్ కాన్ఫరెన్స్ తోపాటు ముంబై మారథాన్ ఈవెంట్‌కు హాజరైనట్లు తెలిపారు. తెలుగులో గోపాలా గోపాలా సినిమా చేస్తున్నానని చెప్పారు. దీంతోపాటు ఓ బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు.

10కె రన్
‘హైదరాబాద్ 10కె రన్' నవంబర్ 30న జరుగనుంది. ప్రతీ ఏడాది మాదిరిగానే ‘రిలయన్స్ జియో హైదరాబాద్ 10కె రన్' పేరిట హుస్సేన్‌సాగర్ తీరంలో నిర్వహించనున్నారు.

శ్రియ
ఈసారి ప్రచారకర్తగా దిగ్గజ స్ప్రింటర్ మిల్కాసింగ్ వ్యవహరించడం విశేషమని 10కె రన్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.

శ్రియ
గురువారం సోమాజిగూడలోని పార్క్ హోటల్‌లో మీడియా సమావేశంలో పరుగు విశేషాలను ఛైర్ పర్సన్ చిగురుపాటి ఉమ వెల్లడించారు.

శ్రియ
పీపుల్స్ ప్లాజా వద్ద ఈ 10కె రన్ తోపాటు 7కె మజా రన్ కూడా ప్రారంభమవుతుందని చెప్పారు.

10కె రన్
10కె రన్‌కు తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని రాష్ట్ర పారిశ్రామిక మౌళిక వసతుల సంస్థ ఎండి జయేష్ రంజన్ అన్నారు. జయేష్ రంజన్ పేరు నమోదుతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు.

10కె రన్
‘10కె రన్ అనేది ఓ ఫన్ యాక్టివిటీ. నగరం మొత్తాన్ని కలిపే కార్యక్రమం అది. మీ నగరం గురించి మీరు మరింతగా తెలుసుకునే అవకాశం కల్పించడంతోపాటుగా ఫిట్‌నెస్ పట్ల మరింత అవగాహన కల్పిస్తుంది' శ్రియ తెలిపారు.

శ్రియ
తాను రోజూ పరుగెడుతానని చెప్పిన శ్రియ, 5కె రన్, 10కె రన్ ఈవెంట్స్‌లో పాల్గొని పరుగు పెట్టింది లేదన్నారు.

శ్రియ
అయితే గతంలో 10కె రన్ ప్రెస్ కాన్ఫరెన్స్ తోపాటు ముంబై మారథాన్ ఈవెంట్‌కు హాజరైనట్లు తెలిపారు. తెలుగులో గోపాలా గోపాలా సినిమా చేస్తున్నానని చెప్పారు. దీంతోపాటు ఓ బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు.
సినీ నిర్మాత సురేష్ బాబుతోపాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, రిలయన్స్ జియో సిఈఓ కెఎస్ వేణుగోపాల్, బిజినెస్ హెడ్ వాసుదేవన్, రమేష్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications