‘తెలంగాణ వారికి భయపడ్డ పవన్! నకిలీ ట్వీట్లతో తప్పుదోవ పట్టిస్తున్నారు’

జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌‌పై పీ విద్యార్థి, యువజన జేఏసీ నాయకుడు అడారి కిషోర్‌కుమార్‌ మండిపడ్డారు.

న్యూఢిల్లీ: జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌‌పై పీ విద్యార్థి, యువజన జేఏసీ నాయకుడు అడారి కిషోర్‌కుమార్‌ మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై నకిలీ ట్వీట్లు చేస్తూ జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌ విద్యార్థులు, యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.

సోమవారం ఏపీ భవన వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా లక్షలాది మంది యువత, విద్యార్థులపై కేసులు పెట్టినప్పుడు ఆయనెందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

Adari kishore fires at pawan kalyan

తెలంగాణ ఉద్యమకారులకు భయపడి సమైక్య ఉద్యమాన్ని, ఉద్యమంలో పాల్గొన్న ప్రజలను పవన్‌ పట్టించుకోలేదని ఆరోపించారు. తమిళనాడు తరహాలో ఉద్యమం అంటున్న ఆయన.. తమిళ హీరోల తరహాలో ప్రజల్ని ఎందుకు ఆదుకోవడం లేదని నిలదీశారు.

గత కొంత కాలంగా ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విద్యార్థులు విశాఖలో తలపెట్టిన హోదా పోరాటానికి సైతం ఆయన మద్దతు తెలిపారు. పలు బహిరంగ సభల్లోనూ ఆయన హోదా కోసం నినదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+