జగన్‌పై ఆది వివాదాస్పద వ్యాఖ్యలు: లోకేష్‌పై విష్ణుకుమార్ ప్రశంసలు

Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి ఆది నారాయణరెడ్డి మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. జగన్‌ది ఊహాత్మకం.. తమది వ్యూహాత్మకం అని వ్యాఖ్యానించారు.

జగన్ విచారణకు సమయం సరిపోదు..

జగన్ విచారణకు సమయం సరిపోదు..

జగన్ కేసులను రోజూ మూడు పూటలు విచారించినా సమయం సరిపోదని మంత్రి ఆది నారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. సొంత బాధలనే తీర్చుకోలేని జగన్ ప్రజల బాధలను ఏం తీరుస్తారంటూ చురకలంటించారు.

  జగన్‌ ఆస్తుల్ని అందుకే స్వాధీనం చేసుకోలేకపోతున్నా: చంద్రబాబు నాయుడు | Oneindia Telugu
  ఆరునెలలు కోర్టుకే.. ఇక యాత్ర?

  ఆరునెలలు కోర్టుకే.. ఇక యాత్ర?

  ఈడీ కేసుల విచారణ ప్రారంభమైతే జగన్‌కు ఆరు నెలల పాటు కోర్టుకే సమయం సరిపోతుందని.. జగన్‌ ఇక ఏ యాత్ర చేయడం కుదరదని మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు.

  లోకేష్‌కు విష్ణు ప్రశంసలు..

  లోకేష్‌కు విష్ణు ప్రశంసలు..

  ఇది ఇలావుంటే ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పనితీరుపై భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్రశంసల వర్షం కురింపించారు. మంగళశారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. మంత్రి లోకేష్ బాగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. ఐటీని అభివృద్ధి చేయడం అంత సులువు కాదని ఆయన అన్నారు. అయితే ఐటీ అభివృద్ధి కోసం మంత్రి లోకేష్ బాగా కష్టపడుతున్నారని కొనియాడారు.

  అభివృద్ధి పనులు అక్కడి నుంచే..

  అభివృద్ధి పనులు అక్కడి నుంచే..

  ఏపీ ప్రభుత్వం ప్రారంభించే ఏ సంక్షేమ కార్యక్రమం అయినా ఎస్సీ కాలనీ నుంచే మొదలవుతుందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఒక జీవోను కూడా కేటాయించడం జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. పంచాయితీల్లో త్వరలో ప్రారంభించే వర్మింకంపోస్టింగ్, సీసీ రోడ్లు, పైప్‌లైన్ పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎస్సీ కాలనీ నుంచే ప్రారంభించాలనే నిర్ణయించామని లోకేష్ వివరించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  adinarayana fires at ys jagan: Vishnu praises Lokesh

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి