కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పై ఆది సెటైర్, నాపై-నాభార్యపై ఫేస్‌బుక్ కామెంట్లు: వైసిపిపై ఎమ్మెల్యే ఆగ్రహం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి ఆదినారాయణ రెడ్డి సెటైర్ వేశారు. జగన్ దైవాంశ సంభూతుడని ఎద్దేవా చేశారు.

|
Google Oneindia TeluguNews

కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి ఆదినారాయణ రెడ్డి సెటైర్ వేశారు. జగన్ దైవాంశ సంభూతుడని ఎద్దేవా చేశారు.

కాకినాడ మేయర్ రేసులో 4గురికి గాడ్ ఫాదర్లు వీరే: తెరవెనుక ప్రయత్నాలుకాకినాడ మేయర్ రేసులో 4గురికి గాడ్ ఫాదర్లు వీరే: తెరవెనుక ప్రయత్నాలు

ఆదివారం కడప నగరంలోని వైయస్ ఆడిటోరియంలో టిడిపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి టిడిపిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి సెటైర్ వేశారు.

కడపలో 10 స్థానాలు గెలిచేలా

కడపలో 10 స్థానాలు గెలిచేలా

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి విజయం సాధించేలా ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే కష్టించి పని చేయాలని జిల్లా అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డి అన్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా అందరం కలిసి పనిచేసి పది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునేలా కృషి చేయాలన్నారు.

జగన్‌కు సలహా ఇచ్చా

జగన్‌కు సలహా ఇచ్చా

మరోవైపు, వైసిపికి చెందిన కొంతమంది నాయకుల నుంచి తనకు ప్రాణహానీ ఉందని బద్వేలు ఎమ్మెల్యే జయరాములు శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, వాటిని తాను ఖండించానని, ప్రతిపక్ష నేతకు సలహా ఇచ్చానని చెప్పారు. దీంతో తన పట్ల కొందరు వైసిపి వాళ్లు అనుచితంగా ప్రవరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తప్పు చేయకున్నా

తప్పు చేయకున్నా

తాను ఎలాంటి తప్పు చేయకున్నా ఫేస్‌బుక్‌లో దూషించారని, ఎమ్మెల్యే అయినా నోటితో చెప్పలేని విధంగా బూతులు పెట్టి అవమానించారని జయరాములు అన్నారు. ఈ నెల 3వ తేదీన చంద్రబాబుపై జగన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను తాను ఖండించినట్లు చెప్పారు.

నాపై, నా భార్యపై అభ్యంతరక వ్యాఖ్యలు

నాపై, నా భార్యపై అభ్యంతరక వ్యాఖ్యలు

దీనిపై పోరుమామిళ్లకు చెందిన చిత్తా ప్రతాప్ రెడ్డి ఫేస్‌బుక్‌లో తనపై అసభ్యంగా విమర్శిస్తూ పోస్టు పెట్టారని జయరాములు తెలిపారు. అప్పటి నుంచి కొన్ని అల్లరి మూకలు తనపై, తన భార్యపై ఫేస్‌బుక్‌లో అభ్యంతకర వ్యాఖ్యలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావతమైతే సహించనని హెచ్చరించారు.

58 మంది దూషించారు

58 మంది దూషించారు

58 మంది ఫేస్‌బుక్‌లో తనను దూషించారని, 185 మంది లైక్‌ చేసి షేర్‌ చేశారని జయరాములు తెలిపారు. ఫేస్‌బుక్‌లో పెట్టిన దూషణలను ఆధారాలతో కడప ఎస్సీ బాపూజీకి స్వయంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోరుమామిళ్ల, బద్వేలు పోలీసు స్టేషన్లలో కూడా ఈ ఘటనపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

నా భార్యకు టిక్కెట్ ఇస్తానంటే వద్దన్నా

నా భార్యకు టిక్కెట్ ఇస్తానంటే వద్దన్నా

బద్వేలు ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని జయరాములు చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2009లో తన భార్యకు బద్వేలు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తామని ఆహ్వానించారన్నారు. దీనికి తాను తిరస్కరించానని చెప్పారు. దీంతో మాజీ ఎమ్మెల్యే కమలమ్మకు టికెట్‌ ఇచ్చారని గుర్తుచేశారు.

కోపం వచ్చేదాకా చూడొద్దు

కోపం వచ్చేదాకా చూడొద్దు

పోరుమామిళ్లలో ఇంట్లో ఒక్కడినే ఉంటున్నానన్నారు. ఫేస్‌బుక్‌లో చంపుతాం, పొడుస్తాం అంటే భయపడే వ్యక్తిని కాదని జయరాములు అన్నారు. సంస్కారం లేకుండా వ్యవహరించనని చెప్పారు. ఫేస్‌బుక్‌లలో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే కోపం కట్టలు తెంచుకునే పరిస్థితికి తనను తీసుకురావద్దన్నారు.

English summary
Minister Adinarayana Reddy on Sunday lashed out at YSR Congress Party chief YS Jaganmohan Reddy and his party activists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X