సర్వనాశనం, జగన్‌లో అది గ్రహించి బయటకు వచ్చా: ఆదినారాయణ రెడ్డి
వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తనను రాజకీయాల్లో సర్వనాశనం చేశారని, అది గ్రహించి తాను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని ఆదినారాయణ రెడ్డి అన్నారు.
విజయవాడ: కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత ఆదినారాయణ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు. దీనికి బుధవారం నాడు ఆయనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తనను రాజకీయాల్లో సర్వనాశనం చేశారని, అది గ్రహించి తాను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని ఆదినారాయణ రెడ్డి అన్నారు. చంద్రబాబు నిన్న గండికోట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
'ఇదీ వైసీపీ అధినేత జగన్ ఆలోచన, ప్రజల గురించి మాత్రం కాదు'
ఆదినారాయణ రెడ్డి 2014లో వైసిపి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. కేశవ రెడ్డి విద్యా సంస్థల గొడవ కారణంగా ఆదినారాయణ రెడ్డి టిడిపిలో చేరినట్లుగా వార్తలు వచ్చాయి. కేశవ రెడ్డి విద్యా సంస్థల చైర్మన్.. ఆదినారాయణ బంధువు.

కాగా, రతనాల రాయలసీమ రాళ్లసీమగా మారుతున్నప్పుడు అన్న ఎన్టీఆర్ స్పందించారని, కరవు కోరల్లో చిక్కిన సీమగడ్డపై జలసిరులు కురిపించేందుకు ప్రయత్నించారని, గాలేరు-నగరి నుంచి తెలుగుగంగ వరకు అనేక రీతుల్లో నీళ్లు తెప్పించి ఇచ్చే దిశగా ప్రణాళికలు రచించారని, అప్పట్లో టిడిపినే ఆ చరిత్ర సృష్టించిందని చంద్రబాబు బుధవారం అన్నారు.
ఆ పునాది రాళ్లను సమాధిరాళ్లుగా మారనీయకుండా తిరిగి వాటిని సాకారం చేసి అదే చరిత్రను తిరగరాశామని, చరిత్ర సృష్టించేదీ మేమే.. దాన్ని తిరగరాసేదీ మేమే అన్నారు.
కడప జిల్లా పర్యటనలో భాగంగా నిన్న ఆయన పులివెందుల నియోజకవర్గ పరిధి సింహాద్రిపురం మండలం పైడిపాళెం వద్ద జరిగిన గండికోట ఎత్తిపోతల నీటిపథకం ప్రారంభోత్సవం, జన్మభూమి, ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మోట్ ద్వారా గండికోట-పైడిపాళెం ఎత్తిపోతల పథకం మోటార్లను ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కుప్పం కంటే ముందే పులివెందులకు నీరిచ్చి మాటనిలబెట్టుకున్నామని, ఇక్కడ ఒక్క సీటు వచ్చినా కడప సంక్షేమానికి పాటుపడుతూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదినారాయణ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications