Adipurush: జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పిందే నిజమైంది; బాక్సాఫీస్ వద్ద టాక్ ఇదే!!
ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ కృతిసనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్. జూన్ 16 న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొడుతుందని భారీ అంచనాలను పెట్టుకుంటే ఈ సినిమాకు దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఈ సినిమా చాలా బాగుంది అంటే, మరి కొందరు ఈ సినిమా పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
రామాయణాన్ని తప్పుగా చూపించారని, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సినిమాలో పాత్రలను తీర్చిదిద్దారని ఆరోపిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ కు ముందు భారీ హైప్ క్రియేట్ చేయడంతో ఆదిపురుష్ సినిమా చూడాలి అని భావించిన వారు ఇప్పుడు వస్తున్న నెగిటివ్ టాక్ తో సినిమా చూడడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఆదిపురుష్ సినిమా రిలీజ్ కు ముందే సినిమా ఎలా ఉంటుందో చెప్పేశారు. ఆయన చెప్పిందే ప్రస్తుతం నిజమైందని టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ జాతకరీత్యా ఆది పురుష్ మూవీ సంచలనాలు సృష్టించే అవకాశం లేదని, బాహుబలి స్థాయి హిట్ ను ఆశించవద్దు అంటూ ఆయన ముందుగానే పేర్కొన్నారు.
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ మాత్రమే సొంతం చేసుకుంటుందని ఆయన ముందే చెప్పారు. ప్రస్తుతం వేణు స్వామి చెప్పిందే జరిగిందని చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే నిన్నటి నుండి ఆదిపురుష్ సినిమాకువస్తున్న టాక్ విని చాలా మంది టికెట్లు బుక్ చేసుకున్న వారు మనసు మార్చుకుంటున్నారు.
బుక్ చేసుకున్న టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా వీకెండ్ టైంలో ఇలా సినిమా టికెట్లు క్యాన్సిల్ చేసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే బయట జరుగుతున్న ప్రచారాన్ని చూసి సినిమాను చూడకుండా ఉండొద్దని ప్రభాస్ ఫాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications