అఫైర్ గుట్టు రట్టు: వివాహిత ఆత్మహత్య, అది తెలిసి అతను...

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ : ఓ యువకుడి అక్రమ సంబంధం గుట్టు రట్టు కావడంతో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. పరువు పోతుందనే భయంతో ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది

ఆమె ఆత్మహత్యతో యువకుడు కూడా పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహిత కూతుళ్లు ఇద్దరు తల్లిలేని పిల్లలయ్యారు. కృష్ణా జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఆరేళ్ల క్రితం వివాహం

ఆరేళ్ల క్రితం వివాహం

పశ్చిమగోదావరి జిల్లా కోనాలపల్లికి చెందిన యాదాల మేరి (21)కి అదే జిల్లా దూసనపూడికి చెందిన యువకుడితో ఆరేళ్ల కిత్రం పెళ్లయింది. వీరికి ఇద్దరు కూతుళ్లు పుట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలోని బొండాడలంక మేకల దిబ్బలో చేపల చెరువుకు మేరి భర్త కాపలదారునిగా పనిచేస్తున్నాడు.

 ఇలా వారిద్దరికి పరిచయం..

ఇలా వారిద్దరికి పరిచయం..

మేరీ కుటుంబం కుటుంబం ఆరు నెలల క్రితం పాలకొల్లు మండలం చింతపర్రులో ఉంటున్న వర్థనపు రాజు మేనకోడలి పెళ్లికి హాజరైంది. ఆ సమయంలో రాజుతో మేరికి పరిచయం ఏర్పడింది. అది అక్రమ సంబంధానికి దారి తీసింది. తొమ్మిది రోజుల క్రితం మేరీ తన పిల్లలను తీసుకుని రాజుతో ఇంటి నుంచి వెళ్లి పోయింది.

గది అద్దెకు తీసుకుని నివాసం..

గది అద్దెకు తీసుకుని నివాసం..

మూడు రోజుల క్రితం కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద గది అద్దెకు తీసుకుని వారిద్దరు ఉంటున్నారు. మంగళవారం రాజు సోదరుడు మరో ఇద్దరు కలసి కొల్లేటికోట వచ్చారు. అక్కడ రాజు కనిపించడంతో ఇంటికి రావాలని చెప్పాడు.

 అందరికీ తెలిసిపోతుందని..

అందరికీ తెలిసిపోతుందని..

తమ విషయం బయటకు తెలుస్తుందనే భయంతో మేరీ తమతో తెచ్చుకున్న సీసాలోని పురుగుమందు సేవించింది. మిగిలిన మందును రాజు కూడా తాగాడు. వారిని 108 వాహనంలో కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి చేయిదాటిపోయింది. చికిత్స పొందుతూ మరణించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A married woman commited suicide in Krishna district withh the illegal affair

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి