• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ - చంద్రబాబు ఫేస్ టు ఫేస్ : ఢిల్లీ వేదికగా - గేమ్ ఛేంజర్..!!

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజకీయం ఢిల్లీకి మారుతోంది. ముఖ్యమంత్రి జగన్..టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ కేంద్రంగా ఒకే వేదిక మీదకు రానున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించే సమావేశంలో పాల్గొనేందుకు ఈ ఇద్దరు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఏపీలో ఇద్దరు ఎన్నికలకు వ్యూహాలు సిద్దం చేస్తున్న వేళ ఢిల్లీ టూర్ కీలకంగా మారుతోంది. ఈ పర్యటనలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధానితో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు ఇప్పటి కే అప్పాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ప్రధానితో చంద్రబాబు భేటీ జరిగితే ఏపీ రాజకీయాల్లో ఆ సమావేశం రాకీయంగా గేమ్ ఛేంజర్ కానుంది.

ఢిల్లీకి సీఎం జగన్ - ప్రతిపక్ష నేత చంద్రబాబు..

ఢిల్లీకి సీఎం జగన్ - ప్రతిపక్ష నేత చంద్రబాబు..

ఏపీలో ముందస్తుగానే ఎన్నికలకు ప్రధాన పార్టీల అధినేతలు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా..ఇప్పటికే ఒకరిని మరొకరు రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు. జిల్లాల పర్యటనల ద్వారా ఇద్దరు నేతలు జోరు మీద ఉన్నారు. వై నాట్ 175 అంటూ జగన్ ముందుకెళ్తున్నారు. టీడీపీ విజయం ఖాయమంటూ చంద్రబాబు ప్రజల్లోకి వస్తున్నారు. ఈ సమయంలోనే 2014 రిపీట్ చేస్తామంటూ చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. అందులో భాగంగా సీఎం జగన్ ను ఓడించేందుకు 2014 తరహాలో మూడు పార్టీల పొత్తుల దిశగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ తో పొత్తు ఖాయమనుకుంటున్న సమయంలో విశాఖ కేంద్రంగా ప్రధానితో జనసేనాని భేటీతో సమీకరణాలు మారాయి. కానీ, చంద్రబాబు చివరి నిమిషం వరకు పొత్తుల విషయంలో తన వంతు ప్రయత్నాలు కొనసాగించే వ్యూహంతోనే కనిపిస్తున్నారు. జగన్ పైన గెలవాలంటే ఏ ఒక్క అవకాశం మిస్ చేసుకోకూడదనేది ఆయన ఉద్దేశం. దీంతో, ఈ లక్ష్య సాధనలో భాగంగా చంద్రబాబు ఢిల్లీ యాత్ర కీలకం కానుంది.

ఇద్దరూ ఒకే వేదిక మీదకు..కలుస్తారా

ఇద్దరూ ఒకే వేదిక మీదకు..కలుస్తారా


జీ 20 నాయకత్వ బాధ్యతలు భారత్ కు దక్కాయి. జీ20 నాయకత్వానికి వహిస్తున్న వేళ..భారత్ ఎటువంటి నిర్ణయాలు అమలు చేయాలనే అంశం పైన పార్లమెంట్ లోని అన్ని పార్టీల అధినేతలతో ప్రధాని సమావేశం ఏర్పాటు చేసారు. రాష్ట్రపతి భవన్ లో ఈ సమావేశం జరగనుంది. అందులో భాగంగా సీఎం జగన్.. చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఇద్దరు నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే, గతంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పై నిర్వహించిన సమావేశంలో చివరి సారిగా ప్రధానిని టీడీపీ అధినేత చంద్రబాబు కలిసారు. ఇక, ఇప్పుడు మరోసారి ఢిల్లీ కేంద్రంగా ప్రధానితో ప్రత్యేకంగా భేటీ కావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. విశాఖకు ప్రధాని వచ్చిన సమయంలో సీఎం జగన్ నేరుగా బహిరంగ సభలోనే తమకు ప్రధానితో సంబంధాలు రాజకీయాలకు అతీతమని స్పష్టం చేసారు. ఇటు బీజేపీ నేతలు టీడీపీ తో పొత్తు ఛాన్స్ లేదని చెబుతున్నారు. కానీ, ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు ఇప్పుడు ఇదే అంశం పై ఢిల్లీలో తమ మార్క్ రాజకీయంగా చూపించేందుకు సిద్దం అవుతున్నారు.

ఏపీ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్

ఏపీ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్


ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా ఇద్దరు ముఖ్య నేతల పర్యటన ఏపీ భవిష్యత్ రాజకీయాలకు కీలకం కానుంది. చంద్రబాబుకు ప్రధాని ప్రత్యేకంగా అప్పాయింట్ మెంట్ దొరుకుతుందా లేదా అనేదే ఇప్పుడు ఆసక్తి కర అంశం. సీఎం జగన్ వచ్చే వారం మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ప్రధాని సమావేశం తరువాత తిరిగి అమరావతికి రానున్న సీఎం.. 6వ తేదీ కడప జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఇప్పటికే టీడీపీ -జనసేన పొత్తు ఖాయమని వైసీపీ అంచనా వేస్తోంది. బీజేపీ వాళ్లతో కలుస్తుందా లేదా అనేది తమకు అవసరం లేదని..తాము మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని వైసీపీ స్పష్టం చేస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ తమ పొత్తు ప్రజలతోనే అంటూ తేల్చి చెప్పారు. ఢిల్లీలో చంద్రబాబు రాజకీయం చూసిన తరువాత కౌంటర్ రాజకీయం జగన్ మొదలు పెట్టే అవకాశం ఉంది. సీఎం జగన్.. చంద్రబాబు ఢిల్లీ వేదికగా ఎటువంటి అమలు చేసే వ్యూహాల పైన అటు పవన్ సైతం ఫోకస్ పెట్టారు. దీంతో..మొత్తంగా ఈ ఇద్దరు నేతల ఢిల్లీ పర్యటన గేమ్ భవిష్యత్ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ కానుంది.

English summary
CM Jagan and TDP Chief Chandra Babu Delhi tour lead to many sepcualtions in the AP Politics. Both leaders to share same state at Delhi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X