ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ ఉండదు.. బాంబు పేల్చిన వేణుస్వామి!

ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయ రంగంలో, సినీ రంగంలోని సెలబ్రిటీల వ్యక్తిగత జాతకాలు చెబుతూ చివరకు ఆయన కూడా ఒక సెలబ్రిటీ అయిపోయాడు. ఆయన చెప్పేదాంట్లో 100కు 99 జరగవు. కానీ వేణుస్వామి మాత్రం తాను చెప్పేవాటిల్లో 100కు 99 జరుగుతాయని బల్లగుద్ది చెబుతారు. అసలు ఆ సెలబ్రిటీల వ్యక్తిగత జాతకాలు వేణుస్వామి దగ్గరకు ఎలా వస్తాయో ఎవరికీ అర్థంకాదు. ఎందుకంటే వారెవరూ జాతకాలివ్వరు. జాతకాల్లేకుండా ఈయన అదిగో పెద్దపులి.. ఇదిగో పెద్దపులి అన్న రేంజ్ లో చెబుతుంటాడు.

జాతకాలను బట్టి విశ్లేషిస్తా
తాజాగా ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ గురించి మాట్లాడాడు. తాను ప్రజల నాడిని చూసి జాతకాలు చెప్పనని, వ్యక్తుల జాతకాలను బట్టి తన విశ్లేషణ ఉంటుందన్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక స్థితిగతులను బేరీజు వేసుకొని చెబితేనే అది జోస్యం అవుతుందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ జాతకాలు తనదగ్గర ఉన్నాయని, జగన్ జాతకం ప్రకారం అతనికి తిరుగులేదని చెప్పారు. చంద్రబాబుకు కొన్ని గ్రహాలు అనుకూలంగా లేవని, ఆయనకు ఎలాంటి రాజయోగం లేదని తేల్చారు.

after ap election results will not exist that political party

ఏపీ రాజకీయాలను శాసించలేడు
ఏపీ రాజకీయాలను శాసించే స్థాయికి పవన్ కల్యాణ్ ఎప్పటికీ రాలేడన్నారు. అతను సినిమాలు చేసుకోవడమే ఉత్తమమైన పని అని, పిఠాపురంలో గెలవడం కూడా చాలా కష్టమన్నారు. ఎన్నికల తర్వాత ఏపీలో ఓ రాజకీయ పార్టీ కనుమరుగవుతుందన్నారు. ప్రస్తుతం వేణుస్వామి చెప్పిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. ఓ రాజకీయ పార్టీ ఉండదు అంటే జనసేన ఉండదా ఏంటి? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడంటూ బల్లగుద్ది మరీ చెప్పాడని, ఆ బల్ల విరిగిపోయిందికానీ కేసీఆర్ మాత్రం గెలవలేదంటూ నెటిజన్లు వేణుస్వామిపై సెటైర్లు వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+