Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతిపై హైకోర్టుకు జగన్ సర్కార్- నాలుగేళ్లు టైమ్ ఇవ్వాలంటూ-సీఎస్ 190 పేజీల అఫిడవిట్

ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన అమరావతి తీర్పుపై ఇవాళ అఫిడవిట్ దాఖలు చేసింది. గతంలో అమరావతి స్ధానంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయాల్ని హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో అసెంబ్లీలో ప్రభుత్వం భారీ చర్చ పెట్టింది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది.

హైకోర్టుకు సీఎస్ సమీర్ శర్మ అమరావతి తీర్పుకు సంబంధించి 190 పేజీల అఫిడవిట్ సమర్పించారు. ఇందులో ఆయన పలు కీలక విషయాలు ప్రస్తావించారు. అలాగే హైకోర్టు తీర్పును అమలు చేసే క్రమంలో అమరావతిని అభివృద్ధి చేసేందుకు నాలుగేళ్లు గడువు ఇవ్వాలని కోరారు. వాస్తవానికి సీఆర్డీయే చట్టం ప్రకారం చూసినా 2024 వరకూ అమరావతిని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఆరునెలల్లో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడం సాధ్యంకాదనే అంశాన్ని ఫైనల్ గా ఆయన హైకోర్టుకు తెలిపారు.

అమరావతి నుంచి రాజధాని తరలిస్తూ మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన చట్టాల్ని వెనక్కి తీసుకుంది. అయితే అప్పటికే వీటిపై దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన హైకోర్టు.. మూడు రాజధానుల ఏర్పాటు చెల్లదని, అమరావతిని మాత్రమే సీఆర్డీయే చట్టం ప్రకారం అభివృద్ధి చేయాలని తీర్పు ఇచ్చింది. అంతే కాదు నెల రోజుల్లో రైతులకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇవ్వాలని, అలాగే ఆరు నెలల్లో అమరావతిలో పనులు పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టింది. వీటి వివరాల్ని ఎప్పటికప్పుడు అఫిడవిట్ల రూపంలో తమకు సమర్పించాలని ఆదేశించింది.

after assembly debate, jagan regime filed affidavit on amaravati verdict in high court

హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ సర్కార్ అసెంబ్లీలో చర్చ పెట్టింది. హైకోర్టు తీర్పును తీవ్రంగా తప్పుబట్టడంతో పాటు అసెంబ్లీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోవద్దంటూ పరోక్షంగా హెచ్చరికలు కూడా పంపింది. జడ్డీల తీరును సీఎంతో పాటు మంత్రులు కూడా తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం ఇవాళ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

హైకోర్టు చెప్పిన ప్రకారం రైతులకు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చెసినట్లు తెలుస్తోంది. అంటే ఓవైపు హైకోర్టు తీర్పును తప్పుబడుతూ అసెంబ్లీలో చర్చ పెట్టినా కోర్టు తీర్పును అమలు చేస్తున్నట్లు అఫిడవిట్ దాఖలు చేసినట్లు అర్ధమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+